ETV Bharat / city

ప్రధాన వార్తలు@ 5PM

.

5pm_Bharat topnews
5pm_Bharat topnews
author img

By

Published : Aug 9, 2020, 5:00 PM IST

  • ఘటనపై కమిటీ వేశాం

విజయవాడ స్వర్ణ ప్యాలెస్​లో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై కమిటీ వేశామని.. పూర్తిస్థాయి నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ప్రమాదానికి నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధరణ అయ్యిందని.. అదే కారణమైతే కనుక అత్యంత కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • గిరిజనుల అభివృద్ధిని వైకాపా ప్రభుత్వం కాలరాస్తోంది..

ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ గిరిజనులకు శుభాకాంక్షలు తెలిపారు. ఐదేళ్ల తెదేపా పాలనలో గిరిజనుల కోసం ఎన్నో పథకాలను తీసుకువస్తే...వైకాపా ప్రభుత్వం అన్నింటినీ నిర్వీర్యం చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • అల్లుడిని చంపిన మామ

మామా నీ కుమార్తెను చంపింది.. నేనే అని ఆ అల్లుడు చెప్పడంతో మామకు కోపం కట్టలు తెచ్చుకుంది. అల్లారుముద్దుగా పెంచి.. కూతురిని అల్లుడి చేతిలో పెడితే. చంపేస్తాడా? అని అల్లుడి తలను నరికేశాడో మామ. తలతోపాటు పోలీస్​ స్టేషన్​కు వెళ్లాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • వనరులు సమకూర్చగలిగేది విశాఖ ఒక్కటే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వనరులు సమకూర్చగలిగేది విశాఖ నగరం ఒక్కటేనని విశ్రాంత ఐఏఎస్ ఐవైఆర్ కృష్ణారావు అభిప్రాయపడ్డారు. అమరావతిని పరిపాలన రాజధానిగా చేసి వాణిజ్య రాజధానిగా విశాఖను అభివృద్ధి చేయటం మీద దృష్టి కేంద్రీకరించాలని ప్రభుత్వానికి సూచించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ఇక ఆ 101 రక్షణ ఉత్పత్తుల తయారీ భారత్​లోనే!

ఆయుధ సంపత్తి సహా రక్షణ ఉత్పత్తుల తయారీకి.. దేశీయంగా ప్రోత్సాహం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రక్షణ ఉత్పత్తులను దేశీయంగానే తయారు చేసుకునేలా 2020-2024 మధ్య వాటి దిగుమతులపై నిషేధం విధించనున్నట్లు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • చిన్న రైతులకు పెద్ద అండ

లక్ష కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. చిన్న రైతులను శక్తిమంతంగా తీర్చిదిద్దడం కోసమే ఈ నిధిని ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • ప్రస్తావనకు రాని 'ఉపసంహరణ'!

సరిహద్దు ఉద్రిక్తతల నడుమ భారత్​-చైనా మధ్య శనివారం దాదాపు 10గంటల పాటు మేజర్​ జనరల్​ స్థాయిలో సమావేశం జరిగింది. డెప్సాంగ్​ ప్రాంతంలో ఉన్న సమస్యలపై చర్చించినట్టు సైనిక వర్గాల సమాచారం. అయితే ఈ చర్చల్లో బలగాల ఉపసంహరణ అంశం అసలు ప్రస్తావనకే రానట్టు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • విధేయతే అన్నింటికన్నా ముఖ్యం

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్ కోసం ఆత్రుతగా ఉన్నట్లు తెలిపాడు. ఈ సందర్భంగా ఆర్సీబీతో తన ప్రయాణం ఎలా సాగిందో తెలుపుతూ ఓ వీడియో విడుదల చేశాడు. ఇది కాస్త నెట్టింట వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

  • మరోసారి ఈడీ ముందుకు రియా

బాలీవుడ్​ హీరో సుశాంత్​ సింగ్​ ఆత్మహత్య కేసులో భాగంగా సోమవారం మరోసారి రియా చక్రవర్తిని ఈడీ ప్రశ్నించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆమె సోదరుడు షోయిక్​నూ విచారణకు పిలవనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.