టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. మాదకద్రవ్యాల మనీలాండరింగ్ కేసులో నేడు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట సినీ నటుడు తరుణ్ హాజరుకానున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే దర్శకుడు పూరిజగన్నాథ్ సహా నటులు రానా, రవితేజ, నందు, చార్మి, రకుల్‌ప్రీత్‌సింగ్, ముమ్మైత్ఖాన్, తనీష్, నవదీప్, ఎఫ్ క్లబ్ మేనేజర్ హరిప్రీత్‌సింగ్, డ్రైవర్ శ్రీనివాస్‌ను అధికారులు ప్రశ్నించారు. మత్తు మందు సరఫరాదారులు కెల్విన్, జీషాన్‌లను కూడా విచారించారు. వీరి బ్యాంకు ఖాతాల్లో అనుమానాస్పద లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరించారు.
కెల్విన్ వాంగ్మూలం సరిపోదు...
ఎక్సైజ్ సిట్ నుంచి తీసుకున్న నివేధిక ఆధారంగా ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఎక్సైజ్ సిట్ మాత్రం సినీ రంగానికి చెందిన వారందరికీ క్లీన్ చిట్ ఇచ్చింది. సినీ నటులు, హోటల్స్, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డ్రగ్స్ అమ్మినట్లు కెల్విన్ వాంగ్మూలం ఇవ్వగా... దాని ఆధారంగా పలువురికి నోటీసులు ఇచ్చి ప్రశ్నించింది. అన్ని సాక్ష్యాలను సిట్ బృందం పరిశీలించి, విశ్లేషించిందన్న ఎక్సైజ్ శాఖ.. నిందితుడు చెప్పిన విషయాలను బలమైన ఆధారాలుగా భావించలేమని తెలిపింది. సెలబ్రిటీలను నిందితులుగా చేర్చేందుకు కెల్విన్ వాంగ్మూలం సరిపోదని.. సినీ ప్రముఖులు, ఇతర అనుమానితుల వద్ద డ్రగ్స్ కూడా లభించలేదని స్పష్టం చేసింది. పూరి జగన్నాథ్, తరుణ్ స్వచ్ఛందంగా బయో శాంపిల్స్ కూడా ఇచ్చారని.. అందులో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఏఫ్ఎస్ఎల్ తేల్చిందని ఎక్సైజ్ అధికారులు తెలిపారు. దీంతో ఈడీ విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.
సంబంధిత కథనాలు..
ASSEMBLY: రాబోయే రెండున్నరేళ్లూ అచ్చెన్న, నిమ్మలకు మాట్లాడే అవకాశం ఇవ్వరట