ETV Bharat / city

నేడు వైకాపా ఆవిర్భావ దినోత్సవం

author img

By

Published : Mar 12, 2021, 7:05 AM IST

వైకాపా నేటితో 10 సంవత్సరాలు నిండి 11వ వసంతంలోకి అడుగిడనుంది. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లో పార్టీ ఆవిర్భావ వేడుకలను వైభవంగా జరిపేందుకు వైకాపా శ్రేణులు ఏర్పాట్లు చేశాయి.

Today Ysrcp  Emergence Day
నేడు వైకాపా ఆవిర్భావ దినోత్సవం

వైకాపా ఆవిర్భవించి శుక్రవారం నాటికి 10 ఏళ్లు పూర్తి కానున్నాయి. 2011 మార్చి 12న వైకాపా రాజకీయ పార్టీగా అవతరించింది. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ జెండాలు ఎగుర వేయాలని, దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి వేడుకలను నిర్వహించాలని ఆ పార్టీ తెలిపింది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు హాజరవుతారని వెల్లడించారు.

ఇదీ చదవండి: గుంటూరు జిల్లా మాచర్లలో పర్యటించనున్న సీఎం జగన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.