పల్లె పోరులో రెండో దశ నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. బుధవారం మొత్తం 25,576 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచ్ స్థానాలకు 50 81 , వార్డు స్థానాలకు 20,495 నామినేషన్లు వేశారు. ఇవాళ్టితో రెండో దశ నామినేషన్ల ప్రక్రియ ముగియనుంది.
విజయనగరం జిల్లాలో రెండో రోజు భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి. పార్వతీపురం డివిజన్‌లో 749 మంది సర్పంచ్ స్థానాలకు, 2,195 మంది వార్డు స్థానాలకు నామినేషన్ దాఖలు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ డివిజన్‌లో సర్పంచ్ పదవికి 214, వార్డు పదవులకు 952 మంది నామపత్రాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె డివిజన్‌లో సర్పంచ్ పదవులకు 601 మంది, వార్డు స్థానాలకు 12 వందల 95 మంది నామినేషన్లు వేశారు. అధికారులు నామపత్రాలు తీసుకోవడం లేదంటూ.. ఎంపీడీవో కార్యాలయం వద్ద కోళ్లబైలు పంచాయతీ అభ్యర్ధులు ఆందోళనకు దిగారు. కడప జిల్లా రాయచోటి, కమలాపురంలో పోటాపోటీగా నామపత్రాలు సమర్పించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం, పలాస, రాజాం నియోజకవర్గాల్లోనూ జోరుగా నామపత్రాలు దాఖలయ్యాయి.
ఇదీ చదవండి
'ఈ వాచ్' యాప్‌పై ప్రభుత్వం కోర్టులో పిటిషన్ వేయకపోతే ఆశ్చర్యం: నిమ్మగడ్డ