ETV Bharat / city

ఇవాళ కేబినెట్ సమావేశం.. చర్చించే కీలక అంశాలివే! - ఏపీ కేబినెట్ సమావేశం న్యూస్​

సీఎం జగన్ అధ్యక్షతన సచివాలయంలోని మెుదటి బ్లాక్​ మండలి సమావేశ మందిరంలో మంత్రివర్గ భేటీ జరగనుంది. మెుత్తం 30కి పైగా అంశాలపై కేబినెట్​లో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

today ap cabinet meeting
author img

By

Published : Oct 30, 2019, 5:52 AM IST

రాష్ట్రవ్యాప్తంగా అగ్రిల్యాబ్స్ ఏర్పాటు, గిరిజన ప్రాంత మహిళలకు పౌష్టికాహార పంపిణీ, మరో విద్యుత్ పంపిణీ సంస్థ ఏర్పాటు లాంటి కీలకమైన ప్రతిపాదనలపై... రాష్ట్ర మంత్రి మండలి ఇవాళ చర్చించి ఓ నిర్ణయం తీసుకోనుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన..సచివాలయంలో జరిగే కేబినెట్ సమావేశానికి 30కి పైగా అంశాలతో అజెండా సిద్ధమైంది.

ఇవాళ కేబినెట్ సమావేశం.. చర్చించే కీలక అంశాలివే!

హజ్​ యాత్రకు ఆర్థిక సాయం పెంపు!

రైతు సంక్షేమంలో భాగంగా... ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో అగ్రిల్యాబ్స్ ఏర్పాటు కోసం ప్రతిపాదనల్ని ప్రభుత్వం సిద్ధం చేసింది. 197 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టే... 147 కొత్త అగ్రి ల్యాబ్స్‌ ఏర్పాటు ప్రతిపాదనపై మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. జెరుసలేం యాత్రకు వెళ్లే యాత్రీకులకు ఇచ్చే ఆర్థికసాయాన్ని 60 వేలకు పెంచడం, 3లక్షల లోపు ఆదాయమున్న హజ్ యాత్రికులకు 40 వేలు... 3 లక్షల కంటే ఎక్కువ ఆదాయమున్న హజ్ యాత్రీకులకు 30 వేల రూపాయల ఆర్థిక సాయం అందించే ప్రతిపాదనపైనా.. మంత్రివర్గంలో చర్చించనున్నారు.

గిరిజన ప్రాంత మహిళల్లో పౌష్టికాహారంపై..

రాష్ట్రంలో 100 గజాల్లోపు అభ్యంతరం లేని ఆక్రమిత ఇళ్ల స్థలాలను నామమాత్రపు రుసుముకే రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోంది. లబ్ధిదారులు రెండేళ్ల తర్వాత సదరు స్థలాన్ని విక్రయించుకునే అవకాశం కల్పిస్తూ చేసినసవరణ ప్రతిపాదనపైనా కేబినెట్ లో చర్చిస్తారు. గిరిజన ప్రాంతాల్లోని 77 మండలాల్లో మహిళలకు పౌష్టికాహారాన్ని రెట్టింపు చేసే అంశంపైనా నిర్ణయం తీసుకోనున్నారు. తిరుమల తిరుపతి మినహా ఇతర దేవాలయాల్లో ట్రస్టు బోర్డు సభ్యుల నియామకంపై ప్రభుత్వానికి అధికారాలను కట్టబెట్టే చట్ట సవరణ పైనా కేబినెట్​లో చర్చించనున్నట్టు తెలుస్తోంది.

మరో డిస్కం ఏర్పాటుపై..

అడ్వకేట్ల సంక్షేమ నిధి పెంపు అంశం ప్రతిపాదనపైనా కేబినెట్‌లో చర్చిస్తారు. అమ్మ ఒడి పథకం పేరును జగనన్న అమ్మ ఒడిగా మారుస్తూ తీర్మానం చేసే అవకాశం ఉంది. రాష్ట్రంలోని 8 రంగాల్లో నిష్ణాతులకు.. వైఎస్ఆర్ లైఫ్ టైమ్ అవార్డులు ఇవ్వాలనే ప్రతిపాదనపైనా చర్చ జరగనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న రెండు విద్యుత్ పంపిణీ సంస్థలకు పని భారం పెరుగుతుండటంతో మరో డిస్కంను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎస్పీడీసీఎల్​ పరిధిలోని నాలుగు జిల్లాలను విడదీసి విజయవాడ కేంద్రంగా సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్-సీపీసీడీఎల్​గా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనపైనా మంత్రివర్గం చర్చించి నిర్ణయం తీసుకోనుంది. ఇక ఎస్సీల్లో మాల, మాదిగ, రెల్లి కార్పోరేషన్ల ఏర్పాటుపైనా మంత్రిమండలిలో చర్చించనున్నారు.

ఇదీ చదవండి:'సర్కారు బడుల్లో 1 నుంచి 8వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమం'

Intro:Body:Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.