కొవిడ్ కారణంగా మార్పులు చేసిన ప్రభుత్వ కార్యాలయాల పనివేళలు పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక నుంచి జిల్లా కార్యాలయాలు, ఇతర ఉపకార్యాలయాలు ఉదయం 10.30 గంటల నుంచి 5 గంటల వరకూ పనిచేస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. రాష్ట్రస్థాయిలో సచివాలయంతో పాటు విభాగాధిపతులు, కార్పొరేషన్లు ఇతర ప్రభుత్వ సంస్థల కార్యాలయాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకూ పనిచేస్తాయని తెలియచేసింది.
కరోనా ప్రభావం స్వల్పంగా తగ్గటంతో యధావిధిగా కార్యాలయ వేళల్ని పునరుద్ధరిస్తున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. జిల్లా కార్యాలయాలకు ఆదివారం, రెండో శనివారం మాత్రమే సెలవు ఉంటుందని స్పష్టం చేసింది. సచివాలయం, విభాగాధిపతులు, కార్పొరేషన్లకు సంబంధించి రాష్ట్ర కార్యాలయాలు మరో ఏడాది పాటు వారానికి ఐదు రోజులే పనిచేస్తాయని వెల్లడించింది. రెండో దశ కరోనా ప్రభావం, కర్ఫ్యూ అనంతరం ప్రభుత్వ కార్యాలయాల పనివేళల్ని పునరుద్ధరిస్తూ సీఎస్ ఆదిత్యనాధ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు
ఇదీ చదవండి: Night curfew in ap: మరో వారం.. రాత్రి కర్ఫ్యూ కొనసాగింపు