ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు పెరగడం వల్ల... తెలంగాణ సరిహద్దు వద్ద అధికారులు అప్రమత్తమయ్యారు. ఏపీ డీజీపీ, కమిషనర్ పాస్లు ఉన్నవారినే తెలంగాణ రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. మెుదటగా వారి పేర్లు నమోదు చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. అనంతరం క్వారంటైన్ ముద్ర వేసి పంపిస్తున్నారు. రోజు 150 నుంచి 200 మంది సొంత వాహనాలలో ఏపీ నుంచి తెలంగాణలోకి వాడపల్లి సరిహద్దు ద్వారా వస్తున్నారని పోలీసులు తెలిపారు.
ఇది చదవండి కరోనా చికిత్సలో కీలక ఘట్టానికి భారత్