వంట గ్యాస్ ధరల పెంపుతో భాజపా ప్రభుత్వం.. మహిళలకు కన్నీళ్లు మిగులుస్తోందని ఏపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి విమర్శించారు. పెట్రోల్, డీజిల్ ధరలు త్వరలోనే సెంచరీ కొట్టేలా ఉన్నాయని ఆవేదన చెందారు. గత డిసెంబర్ 2వ తేదీన రూ.50, డిసెంబర్ 15న రూ.50, ఫిబ్రవరి 4న రూ.25, 14న మళ్లీ 50 రూపాయలు పెంచారని గుర్తు చేశారు.
ఈ ఏడు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్లో లీటర్ పెట్రోల్ మీద 2.50 పైసలు, లీటరు డీజిల్పైన 4 రూపాయలు అగ్రి - ఇన్ ఫ్రా సెస్సు విధించడం దుర్మార్గమని విమర్శించారు. కరోనా లాక్ డౌన్ వల్ల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే గోరుచుట్టుపై రోకటి పోటు లాగా ధరలు పెంచడం భావ్యమా అని... తులసిరెడ్డి కేంద్రాన్ని ప్రశ్నించారు.
ఇదీ చదవండి: