గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కృష్ణాయపాలెంలో రైతుల దీక్షపై మందు బాటిల్ విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి అమరావతి వెళ్తోన్న సిటీబస్సులో ప్రయాణిస్తున్న యువకుడు... ఖాళీ మందు సీసాను దీక్షా శిబిరంపైకి విసిరాడు. బస్సు వేగంగా వెళ్లడం వల్ల రైతులు మందడంలో దీక్ష చేస్తున్న వారికి సమాచారం ఇచ్చారు. అక్కడ బస్సు ఆపిన అన్నదాతలు మందు బాటిల్ విసిరిన వ్యక్తిని పట్టుకుని మంగళగిరి పోలీసులకు అప్పగించారు. నిందితుణ్ని ధరణికోటకు చెందిన శ్రీనివాసరెడ్డి గుర్తించారు. రైతులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: