ETV Bharat / city

అమెరికాలో ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ వాసుల మృతి

అమెరికా టెక్సాస్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు. పూర్తి వివరాల్లోకి వెళితే...

three-telangana-residents-died-in-accident-at-texas-america
అమెరికాలో ప్రమాదం
author img

By

Published : Nov 29, 2020, 12:43 PM IST

అమెరికా టెక్సాస్‌లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు తెలంగాణ వాసులు మృతి చెందారు.

అసలేం జరిగిందంటే..?

మహబూబ్​నగర్​ జిల్లా మరికల్​ మండలం పెద్దచింతకుంటకు చెందిన జి.నరసింహారెడ్డి, లక్ష్మి దంపతులకు ఒక కుమారుడు, కుమార్తె. నరసింహారెడ్డి హైదరాబాద్​-1 డిపోలో కండక్టర్​గా పని చేస్తున్నారు.

పిల్లలు ఇద్దరు అమెరికా టెక్సాస్​లో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు. 6 నెలల క్రితం కుమారుడు, కుమార్తె వద్దకు నరసింహారెడ్డి దంపతులు వెళ్లారు. కుమార్తె వివాహం కుదుర్చుకునేందుకు టెక్సాస్​ వెళ్లగా.. అక్కడ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో దంపతులు నరసింహారెడ్డి, లక్ష్మి, కుమారుడు భరత్​రెడ్డి మృతి చెందారు. కుమార్తె మౌనికకు ప్రమాదంలో తీవ్రగాయాలు కాగా.. పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.

ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలుసుకునేందుకు బంధువులు అక్కడే ఉన్న తానా/ఆట సంఘం సభ్యులను సంప్రదిస్తున్నారు. నరసింహారెడ్డి హైదరాబాద్​లోని సంతోష్​నగర్​లో నివాసం ఉంటున్నారు.

ఇదీ చదవండి:

దారుణం.. సైనైడ్‌తో కుక్కను చంపి.. తర్వాత భర్తపై ప్రయోగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.