ETV Bharat / city

Tragedy: రూ.80 లక్షలు ఖర్చు చేసినా.. కుటుంబంలో ముగ్గురు మృతి! - నెల రోజుల వ్యవధిలోనే కుటుంబంలో తల్లి, కుమారుడు, కుమార్తె మృతి

కరోనా ఎంతో మంది కుటుంబాల్లో విషాదాన్ని నింపుతుంది. తాజాగా ఓ కుటుంబంలో ముగ్గురిని బలిగొంది. నెల రోజుల వ్యవధిలోనే కుటుంబంలో తల్లి, కుమారుడు, కుమార్తె కరోనాకు బలయ్యారు. 80 లక్షలరూపాయలు ఖర్చు చేసినా... ప్రాణాలు మాత్రం మిగలలేదు.

3 dead
3 dead
author img

By

Published : Jun 15, 2021, 9:43 AM IST

రూ.80 లక్షలు ఖర్చు చేసినా.. తల్లి, కుమారుడు, కుమార్తె మృతి
తల్లి సులోచన, కుమారుడు సుభాష్‌, కుమార్తె లావణ్య

కరోనా కాటుకు నెల వ్యవధిలో తల్లి, కుమారుడు, కుమార్తె బలైన సంఘటన తెలంగాణ శంషాబాద్‌ మున్సిపల్‌ పరిధిలో చోటు చేసుకుంది. తొండుపల్లికి చెందిన పెదిరిపాటి విఠలయ్య-సులోచన దంపతులకు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె. ఏప్రిల్‌ 28న చిన్న కుమారుడు సుభాష్‌ తన 25వ వివాహ వార్షికోత్సవ వేడుకులను కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి జరుపుకున్నారు. ఈ క్రమంలో ఆ కటుంబ సభ్యుల్లో ఐదుగురు కరోనా బారిన పడ్డారు.

మే 1న సులోచన(70)ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ 12న మృత్యువాత పడ్డారు. అస్వస్థతకు గురైన కుమారుడు సుభాష్‌(50), కుమార్తె లావణ్య(45)లను ఆసుపత్రికి తరలించారు. 25 రోజుల అనంతరం సుభాష్‌ ఈ నెల 8న తుది శ్వాస విడవగా.. 31 రోజులు ఆసుపత్రిలో కరోనాతో పోరాడిన లావణ్య సోమవారం మృత్యువాత పడ్డారు. ఆ ఇంట్లో కుమారుడి దశదిన కర్మ రోజే కుమార్తె అంత్యక్రియలు చేయడంతో పలువురు స్థానికుల సైతం కంటతడి పెట్టారు.

లావణ్య భర్త కిరణ్‌గౌడ్‌ పదేళ్ల క్రితమే మృతి చెందారు. అప్పటి నుంచి అమ్మగారింట ఉంటున్నారు. సుభాష్‌ భార్య చంద్రిక ఇంటి వద్దనే కరోనాను జయించగా.. అతని కుమారుడూ కోలుకున్నాడు. కరోనా బారిన పడిన సులోచన, సుభాష్, లావణ్యను బతికించుకునేందుకు నెల రోజుల పాటు కార్పొరేట్‌ అసుపత్రుల్లో రూ.80లక్షలకు పైగా ఖర్చు పెట్టినా వారి ప్రాణాలు దక్కలేదు.

ఇదీ చూడండి:

YSR VAHANA MITRA: నేడు వాహనమిత్ర మూడో ఏడాది ఆర్థికసాయం విడుదల!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.