ETV Bharat / city

ఈ బాస్​ల మీటింగ్ రూల్సే..సపరేటు ! - సత్యనాదెళ్ల మీటింగ్ రూల్స్

కార్పొరేట్‌ ప్రపంచంలో ఉన్నవాళ్లకి మీటింగులు రోజువారీ పనుల్లో భాగం. మరి ప్రపంచ ప్రసిద్ధ కార్పొరేట్‌ ప్రముఖుల్లో కొందరు ఆ సమావేశాలకు ఎలా హాజరవుతారో, మీటింగులకు వారిచ్చే ప్రాధాన్యం ఎలాంటిదో... తెలుసుకోవాలని ఉందా? అయితే  ఇంకేందుకు ఆలస్యం తెలుసుకుందాం పదండి !

ఈ బాస్​ల మీటింగ్ రూల్సే..సపరేటు !
author img

By

Published : Oct 20, 2019, 12:21 PM IST

జెఫ్‌ బెజోస్​ది టూ పిజ్జా రూల్...
ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు అమెజాన్‌ వ్యవస్థాపకుడైన జెఫ్‌ బెజోస్‌. ఆ కంపెనీ సీయీవో కూడా అయిన జెఫ్‌... సమావేశ మందిరంలో ఉన్న వారందరికీ కేవలం రెండు పిజ్జాల్ని స్నాక్స్‌గా తీసుకురమ్మంటారట. దీన్నే ఆ కంపెనీలో ‘టూ పిజ్జా రూల్‌’గా చెబుతారు. అంటే, సాధ్యమైనంత తక్కువమంది సమావేశానికి హాజరవుతారన్నమాట. అమెజాన్‌ సమావేశాల్లో పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్లు ఉండవు. ఏ సమాచారమైనా కాగితం మీద రాసుకుని వినిపించడమే.

సత్య నాదెళ్లవి మూడు నియమాలు
ప్రపంచంలోనే అత్యధిక వేతనం పొందే సీఈఓల్లో ఒకరు మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల. ఈయన తన సమావేశాల నిర్వహణలో మూడు నియమాల్ని అమలు చేస్తారు. అవి... ఎక్కువ వినడం, తక్కువ మాట్లాడటం, సకాలంలో నిర్ణయం తీసుకోవడం. సహచరుల మాటల్ని వింటున్నామంటే వాళ్లకీ ఇతర సభ్యుల మీద నమ్మకం ఏర్పడుతుంది, అలాంటి సుహృద్భావ వాతావరణంలో ఎవరైనా తమ ఆలోచనల్ని ధైర్యంగా చెప్పగలరు’ అనేది సత్య ఉద్దేశం. అలాగే, తక్కువ మాట్లాడటం అంటే- ఎక్కువ ప్రశ్నలు అడగటం, మనం చెప్పాల్సింది కచ్చితంగా చెప్పడం, మనకు కేటాయించిన టైమ్‌ని సక్రమంగా సమర్థంగా వినియోగించడం... అందరి అభిప్రాయాలూ విని, చివరకు ఒక నిర్ణయం తీసుకుంటేనే ఆ సమావేశం సఫలం అయినట్లంటారు సత్య.

నిర్ణయం తీసుకోవాలంటే అడుగులు వేయాల్సిందే...
గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచ్చయ్‌ నిర్వహించే సమావేశాల్లో సభ్యులందరూ మాట్లాడాక చివరగా తాను మాట్లాడతారు. అందరి ఆలోచనల్నీ క్రోడీకరించి ఒక నిర్ణయం తీసుకుంటారు. నాలుగు గోడల మధ్య కూర్చోవడం కంటే నడిస్తేనే తనకు ఆలోచనలు వస్తాయంటారు సుందర్‌. ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటపుడు తన ఆఫీసులో నడుస్తూనే మాట్లాడతారట. సమావేశాల మధ్యలో కూడా తన అభిప్రాయాన్ని చెప్పేముందు సీట్లోనుంచి లేచి ఓసారి బయటకు వెళ్లి వస్తారట. అలా వెళ్లి వచ్చి చాలా సమస్యలకు తనదైన పరిష్కారాన్ని చూపుతుంటారు. ‘నేను ఆలోచించాలంటే అడుగులు వేస్తూ ఉండాలి’ అని చెబుతారు సుందర్‌. అందుకేనేమో ఆయన ఆఫీసులో ట్రెడ్‌మిల్‌ డెస్క్‌టాప్‌నీ వినియోగిస్తారు.

పచ్చని చెట్ల మధ్యే మీటింగ్
కీలకమైన వ్యక్తులతో సమావేశాన్ని సాధ్యమైనంత వరకూ ఆఫీసు బయట పార్కులూ, ఆఫీసు ప్రాంగణంలోని పచ్చని చెట్ల మధ్య ఏర్పాటు చేస్తుంటారు ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు జుకర్‌బర్గ్‌. సంస్థలో కీలక స్థానాల్లో నియామకం చేయాల్సి ఉంటే ఆ అభ్యర్థిని తనతోపాటు వాకింగ్‌కి తీసుకువెళ్తారు. వాకింగ్‌ ముగియగానే అతడి నియామకంపైన ఒక నిర్ణయం తీసుకుంటారు. వాట్సాప్‌ సహ వ్యవస్థాపకుడు జాన్‌ కౌమ్‌తో పలుసార్లు ఇలా వాకింగ్‌ మీటింగ్‌లు జరిగాకే ఆ సంస్థను రూ.లక్ష కోట్లకు కొనుగోలు చేయడానికి జుకర్‌బర్గ్‌ నిర్ణయించుకున్నారట.

ఇదీచదవండి

ఈటీవీ భారత్​ 'వైష్ణవ జన తో' గీతానికి మోదీ అభినందన

Intro:Body:

taaza

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.