ETV Bharat / city

తెలంగాణలో పెరుగుతున్న కొవిడ్‌ కేసులు

తెలంగాణలో కరోనా మళ్లీ కోరలు చాస్తోంది. కొవిడ్ కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. బాధితుల్లో 90 శాతం మందిలో ఎటువంటి లక్షణాలు లేకపోవడం గమనార్హం. ఇటీవల నమోదవుతున్న కేసుల్లో దాదాపు 40 శాతం మంది విద్యార్థులే ఉన్నారని వైద్యవర్గాలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నెలాఖరు నాటికి కేసుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నాయి.

no symptoms
తెలంగాణలో పెరుగుతున్న కొవిడ్‌ కేసుల సంఖ్య..
author img

By

Published : Mar 20, 2021, 8:35 AM IST

తెలంగాణలో కొత్తగా నమోదవుతున్న కొవిడ్‌ కేసుల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. తాజాగా 313 మందిలో కరోనా వైరస్‌ ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. కొత్తగా వెలుగు చూస్తున్న కేసుల్లో వైరస్‌ లక్షణాలు లేని బాధితులు దాదాపు 90 శాతం మంది ఉండటం గమనార్హం. ఇప్పటివరకూ రాష్ట్రంలో ఈ తరహా కొవిడ్‌ బాధితులు సుమారు 70 శాతం మంది ఉండగా.. తాజాగా ఈ సంఖ్య ఏకంగా 90 శాతానికి పెరగడం ఆరోగ్య శాఖ అధికారులనే ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఎటువంటి లక్షణాల్లేకుండా కొవిడ్‌ ఉన్నట్లుగా నిర్ధారణ కావడం వల్ల.. బాధితుల్లో తీవ్రమైన అనారోగ్య సమస్యలేవీ రావని, ఇది ఒక విధంగా చూస్తే ఆహ్వానించదగిన పరిణామమేనని వైద్యవర్గాలు చెబుతున్నాయి. అయితే దీని వల్ల నష్టం జరిగే ప్రమాదమూ పొంచి ఉందని కూడా హెచ్చరిస్తున్నాయి. ఎటువంటి లక్షణాల్లేకపోవడం వల్ల బాధితులెవరూ కొవిడ్‌ జాగ్రత్తలేవీ పాటించడం లేదని, వారి ద్వారా వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న ఇతరులకు త్వరగా వైరస్‌ వ్యాప్తి చెందుతుందని ఆందోళన చెందుతున్నాయి. ఇటీవల కొత్తగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు 40 శాతం మంది 12-18 ఏళ్లలోపు విద్యార్థులేనని వైద్యవర్గాలు చెబుతున్నాయి. ఇప్పటి వరకూ నమోదైన గణాంకాల్లో 11-20 ఏళ్లలోపు వారిలో బాధితులు 9.03 శాతం ఉండగా.. తాజాగా ఏకంగా నాలుగింతలకు పైగా ఈ వయసు వారిలో కేసుల సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది. పాఠశాలలు, కళాశాలలు పునఃప్రారంభం కావడం.. పని ప్రదేశాల్లో కొవిడ్‌ నిబంధనలను ఉల్లంఘించడం వల్ల వైరస్‌ అతి వేగంగా వ్యాప్తి చెందుతోందని వైద్యవర్గాలు భావిస్తున్నాయి.

స్వల్ప లక్షణాలతోనే..

ఏడాది కిందట కొవిడ్‌ కేసులు నమోదైన తొలినాళ్లలో జలుబు, దగ్గు, జ్వరం, గొంతునొప్పి, నీరసం తదితర తీవ్ర లక్షణాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందేవారు. తాజా కేసుల్లో ఈ లక్షణాలు చాలా స్వల్పంగా కనిపిస్తున్నాయని వైద్యవర్గాలు చెబుతున్నాయి. సాధారణ జలుబు, కొద్దిగా పొడి దగ్గు, జ్వరం లేకపోవడం, ఒకవేళ వచ్చినా 99-100 డిగ్రీల లోపే నమోదవడం, రుచి, వాసన గుర్తించలేకపోవడం వంటి లక్షణాలు ఎక్కువమందిలో ఉన్నాయి. లక్షణాల తీవ్రత లేకపోవడం వల్ల కూడా అధికులు కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవడానికి ముందుకు రావడం లేదు. ఫలితంగా వైరస్‌ వ్యాప్తి క్రమేణా పెరగడానికి వారు కారణమవుతున్నారని వైద్యవర్గాలు చెబుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే నెలాఖరు నాటికి కేసుల సంఖ్య రెట్టింపయ్యే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నాయి.

ఈ ఏడాదిలో అత్యధిక కేసులు

తెలంగాణలో కొత్తగా 313 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి.ఈ ఏడాదిలో ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే అత్యధికం. మొత్తం బాధితుల సంఖ్య 3,02,360 మందికి పెరిగింది. మహమ్మారి కోరల్లో చిక్కి మరో ఇద్దరు మృతిచెందగా, ఇప్పటి వరకూ 1,664 మంది కన్నుమూశారు. తాజాగా 142 మంది కోలుకోగా, మొత్తంగా 2,98,262 మంది కరోనా చికిత్స పొంది ఆరోగ్యవంతులయ్యారు. ఈ నెల 18న(గురువారం) రాత్రి 8 గంటల వరకు నమోదైన కొవిడ్‌ సమాచారాన్ని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ జి.శ్రీనివాసరావు శుక్రవారం విడుదల చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,434 మంది చికిత్స పొందుతుండగా, వీరిలో 943 మంది ఐసొలేషన్‌ వైద్యసేవల్లో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం 62,972 నమూనాలను పరీక్షించగా, మొత్తంగా పరీక్షలు చేయించుకున్న వారి సంఖ్య 94,82,649కి చేరింది. మరో 642 నమూనాల ఫలితాలు వెల్లడవ్వాల్సి ఉంది. తాజా ఫలితాల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 47 కొత్త కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే రోజుకు 60వేలకు పైగా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తుండడంతో.. ఇదే ఒరవడి కొనసాగించాలని, పాఠశాలలు, కళాశాలలు, పని ప్రదేశాలు, షాపింగ్‌ మాల్స్‌ వద్ద కొవిడ్‌ నివారణ చర్యలపై అవగాహన కల్పించాలని వైద్య శాఖ నిర్ణయించింది.

రాష్ట్రంలో 246మందికి పాజిటివ్‌

రాష్ట్రంలో గత 24గంటల్లో 246మంది కరోనా బారినపడ్డారు. గురువారం ఉదయం 9గంటల నుంచి శుక్రవారం ఉదయం 9గంటల వరకు 31,546 నమూనాలను పరీక్షించారు. కొవిడ్‌తో ప్రకాశంలో ఒకరు మరణించారు. అత్యధికంగా గుంటూరు 58 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

ఇదీ చదవండి: అదుపుతప్పిన వరి నూర్పు యంత్రం... ఇద్దరు మహిళలు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.