ETV Bharat / city

చోరీలు చేయడంలో ఈ దొంగ రూటే సెపరేటు.. మీరే చూడండి..! - Theft in the medical shop

అది గురువారం అర్ధరాత్రి. సమయం సుమారు 2 గంటల 10 నిమిషాలు. ఆ సమయంలో ఓ వ్యక్తి మెడికల్​ షాపు వద్దకు వచ్చాడు. అటూ ఇటూ చూశాడు. ఎవరూ లేరని నిర్ధారించుకుని.. మెల్లిగా బట్టలు విప్పడం మొదలెట్టాడు. నగ్నంగా మారి.. షాపులోపలికి ప్రవేశించాడు. సుమారు 2 గంటల తర్వాత లోపలి నుంచి బయటకొచ్చాడు. తిరిగి బట్టలేసుకుని దర్జాగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇంతకీ ఆ 2 గంటలు అతడు లోపల ఏం చేశాడనేనా..మీరే చదవండి...

theft-in-the-medical-hall-at-sanatnagar-ps-limits

author img

By

Published : May 13, 2022, 7:01 PM IST

తెలంగాణలోని హైదరాబాద్​ సనత్‌నగర్‌ బస్టాండ్‌ను ఆనుకుని ప్రధాన రహదారిపై ఉన్న ఓ మెడికల్‌ హాల్‌లో గురువారం తెల్లవారుజామున ఓ దొంగ చోరీకి పాల్పడ్డాడు. షట్టర్‌ తాళం పగులగొట్టి లోపలికి వెళ్తూ తన దుస్తులు విప్పేసిన దొంగ.. రెండు గంటల పాటు నగ్నంగానే అందులో ఉన్నాడు. తిరిగి బయటికొస్తూ దుస్తులు వేసుకున్నాడు. ఈ విచిత్ర ఘటన సనత్‌నగర్‌ ఠాణా పరిధిలో జరిగింది. సనత్‌నగర్‌ బస్టాండ్‌లో పోలీసులు రాత్రి వాహన తనిఖీలు నిర్వహిస్తుండగానే.. పక్కనే ఈ చోరీ జరగడం గమనార్హం.

పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సనత్‌నగర్‌ బస్టాండ్‌ సమీపంలో బాలాజీ ఫార్మాలోకి అర్ధరాత్రి ఓ దొంగ ప్రవేశించాడు. షట్టర్‌ తాళాలు విరగ్గొట్టి లోపలికి నగ్నంగా ప్రవేశించిన దొంగ.. రెండు గంటల పాటు లోపలే ఉండి తెల్లవారుజామున 4.10 గంటలకు బయటపడ్డాడు. డ్రాలో ఉన్న రూ.2 లక్షల నగదు తీసుకుని బయటికొచ్చి.. తిరిగి దుస్తులు వేసుకుని దర్జాగా నడుచుకుంటూ వెళ్లాడు. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి. ఉదయాన్నే చోరీ జరిగినట్లు గుర్తించిన దుకాణం నిర్వాహకుడు ఎం.వంశీకృష్ణ.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

చోరీలు చేయడంలో ఈ దొంగ రూటే సెపరేటు.. మీరే చూడండి..!

ఇవీ చూడండి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.