ఆచార్య నాగార్జున విశ్వ విద్యాలయం ఉప కులపతి వ్యవహారంపై తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీలు గవర్నర్ బిశ్వభూషణ్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. వీసీ అవినీతికి పాల్పడడంతో పాటు విద్యార్థులతో అన్యాయంగా వ్యవహరిస్తున్నారంటూ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. తెదేపా నేతలతోపాటు పలు విద్యార్థి సంఘాల ప్రతినిధులు గవర్నర్‌ను కలిసి ఏఎన్‌యూలో పరిస్థితిని వివరించారు. వీసీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీలు బచ్చుల అర్జునుడు, అశోక్ బాబు, రామకృష్ణ , సీపీఐ నేత ముప్పాళ్ల నాగేశ్వరరావు, విద్యార్థి సంఘాల నేతలు గవర్నర్‌ను కలిసి వినతిపత్రం ఇచ్చారు .