పోస్టుమార్టం చేసే సమయంలో మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు చూపించి రీపోస్టుమార్టం నిర్వహించడం జరిగిందని హైదరాబాద్ గాంధీ సూపరింటెండెంట్ అన్నారు. ఎయిమ్స్ బృందమే వీడియో చిత్రీకరణ చేసిందని తెలిపారు. ప్రతి అంశం రికార్డు చేయడం జరిగిందని పేర్కొన్నారు.
గతంలో చేసిన వైద్య బృందానికి సంబంధం లేకుండా రీపోస్టుమార్టం జరిగిందని అన్నారు. రికార్డు చేసిన సీడీలు ఫోరెన్సిక్ అధికారులు హైకోర్టు రిజిస్ట్రార్‌కు పంపించడం జరుగుతుందని చెప్పారు. రీపోస్టుమార్టం తర్వాత కోర్టు ఆదేశాల ప్రకారం మృతదేహాలు వారి బంధువులకు అప్పగిస్తామని పేర్కొన్నారు.
ఇదీ చూడండి : హైదరాబాద్‌లో సీసీఎస్ ఎస్ఐ ఆత్మహత్య