ETV Bharat / city

'టీకా చక్కగా పని చేస్తోంది.. ప్రజలు కొవిడ్‌ జాగ్రత్తలు పాటించాల్సిందే' - Covid Vaccine

కరోనా పాజిటివ్‌ వచ్చిన రోగులతో పోల్చితే, టీకా తీసుకున్న వారిలోనే యాంటీబాడీలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందుకే ప్రభుత్వం టీకా పంపిణీని మరింత సరళతరం చేస్తోంది. మహారాష్ట్రలో కరోనా సెకండ్‌ వేవ్‌ స్పష్టంగా కనిపిస్తోంది. మన రాష్ట్రంలో ఈ రెండోదశను సమర్థంగా అడ్డుకునేందుకు ప్రజల సహకారం తప్పనిసరి. రాష్ట్ర ప్రభుత్వమూ ఈసారి మరింత పకడ్బందీగా పని చేస్తోందని కొవిడ్‌-19 రాష్ట్ర నోడల్‌ అధికారి, రాష్ట్ర నిపుణుల కమిటీ సభ్యులు ప్రొఫెసర్‌ కె.రాంబాబు వివరించారు.

ప్రొఫెసర్‌ కె.రాంబాబు
ప్రొఫెసర్‌ కె.రాంబాబు
author img

By

Published : Mar 21, 2021, 5:28 AM IST

టీకా ద్వారా ప్రజలను రక్షించొచ్చు అనే భరోసా కలుగుతోందా?

100 శాతం. ప్రస్తుతం రెండో డోసు వేసుకున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందిలో రెండు వారాల తర్వాత నమూనా పరీక్షలు నిర్వహించి చూశాం. వారిలో యాంటీబాడీలు 200 నుంచి 250కి పైగా యూనిట్లు పెరిగినట్లు కనిపిస్తున్నాయి. ఇలాంటి వారిలో 100% వ్యాధి నిరోధకత వచ్చింది. అంటే టీకాపై ఎలాంటి అపోహలు అవసరం లేదు. దుష్ప్రభావాలు కూడా చాలా తక్కువ. టీకా తీసుకున్న తర్వాత మరణించిన వారి కేసుల్లో... టీకా వల్లే చనిపోయారనడానికి ఆధారాల్లేవు.

కరోనా రాకుండా యాంటీబాడీలు ఎంతకాలం పోరాడతాయనే దానిపై స్పష్టత వస్తోందా?

ఇది కచ్చితంగా చెప్పలేం. ఎనిమిది నెలలో, రెండేళ్లో, మూడేళ్లో.. శరీరంలో ఎంతకాలం ఉంటాయనే అంశంపై ఇంకా పరిశోధించాల్సి ఉంది. గతంలో పాజిటివ్‌ వచ్చిన రోగుల్ని తీసుకుంటే.. యాండీబాడీలు పెరిగిన వారిలో కనీసం ఆరు నెలల నుంచి ఎనిమిది నెలలకు పైగా అవి పోరాడుతూనే ఉన్నట్లు గుర్తించాం.

టీకాతో వచ్చే 250పైగా యూనిట్ల యాంటీబాడీలు వైరస్‌తో మరింతగా పోరాడే అవకాశాలు మెండుగా ఉన్నాయి. యాంటీబాడీలను పుట్టించే బీసెల్స్‌ ఒక్కోసారి శరీరంలో శాశ్వతంగా కూడా ఉండిపోవచ్చు. ఇదే జరిగితే శాశ్వతంగా రక్షణ ఉంటుంది. టీకా ప్రక్రియ ప్రధాన లక్ష్యం కూడా ఇదే. ఇప్పటికే రాష్ట్రంలో 15 లక్షల మందికి మించి టీకా వేశారు.

కొవిడ్‌ ఉద్ధృత స్థాయిని మనం దాటినట్లా, లేనట్లా?

కొవిడ్‌-19 ఇప్పటికీ అదే స్థాయిలో ఉంది. అంటే.. వైరస్‌ ఇంకా తన ఉనికిని విస్తరించుకుంటూనే ఉంది. ఒకవేళ అది సీజనల్‌గా అప్పుడప్పుడూ వచ్చిపోయేలాగా మారితే... అప్పుడు శాశ్వతంగా ఉండిపోయే స్థాయికి (ఎండమిక్‌) చేరుకుంటుందని అర్థం. కానీ.. ఈ పరిస్థితి ఇప్పుడే కనిపించడంలేదు. ఎండమిక్‌ వస్తే మాత్రం మనం బయటిపడిపోయినట్లే. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నాం.

టీకా పంపిణీ మరింత సులభతరం ఎలా చేస్తున్నారు?

ఇప్పుడు ఆధార్‌ ఉంటే చాలు. 45 ఏళ్లకు పైబడినవారు, జబ్బులున్నవారు ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా టీకా వేస్తున్నారు. త్వరలో మిగిలిన వయసులవారికీ అందే అవకాశం ఉంది. www.cowin.gov.in వెబ్‌సైట్‌ ద్వారా టీకా కేంద్రాల సమాచారం తెలుసుకోవచ్చు.

రాష్ట్రంలో కొవిడ్‌ సెకండ్‌ వేవ్‌ వచ్చే అవకాశముందా...?

మహారాష్ట్రలో పాజిటివ్‌ కేసులు, మరణాలూ పెరుగుతున్నాయి. అంటే... మనం కూడా ప్రమాదంలోనే ఉన్నట్లే. ఎందుకంటే చాలామందిలో నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది. కొందరు ప్రైవేటు ల్యాబుల్లో పరీక్షలు చేయించుకుని పాజిటివ్‌ వచ్చినా చెప్పడం లేదు. ఇవన్నీ సెకండ్‌వేవ్‌కు దారి తీయొచ్చు. చిత్తూరు, కృష్ణా, విశాఖలో కేసులు పెరుగుతున్నాయి. మూడు, నాలుగు రోజుల్నుంచి గుంటూరు, అనంతపురం, శ్రీకాకుళంలోనూ కనిపిస్తున్నాయి. ఇవన్నీ హెచ్చరికలే.

కొవిడ్‌ నియంత్రణ విధానాలపై ప్రజలకు ఏం చెప్పాలని అనుకుంటున్నారు?

కొవిడ్‌-19 లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా వెంటనే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి వైద్యుని సలహాలు తీసుకోండి. వారు చెప్పినట్లే చేయండి. మహారాష్ట్రలో ప్రజలు ఆసుపత్రులకు చాలా ఆలస్యంగా వెళుతుండటంతోనే మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. వ్యాధి వచ్చిన 7-11 రోజుల మధ్య ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తోంది. అలాంటి పరిస్థితులు మన రాష్ట్రంలో రాకుండా మాస్కులు ధరించడం, అర్హులైనవారు టీకా వేయించుకోవడం ఉత్తమం.

కొత్త ‘స్ట్రెయిన్‌’లు రాష్ట్రంలోకి రావడంపై ఎలాంటి పరిశోధనలు చేశారు?

గతంతో పోల్చితే ఇప్పుడు కొత్త స్ట్రెయిన్‌లు మరింత ఎక్కువ తీవ్రత చూపిస్తున్నాయి. ఉదాహరణకు యూకే నుంచి వచ్చిన బీ117 స్ట్రెయిన్‌ ఇదివరకు 75% వేగంగా విస్తరిస్తుందని అనుకున్నాం. అయితే కొన్నిచోట్ల మరణాలు సైతం నమోదవుతున్నాయి. దాంతో సీఎస్‌ఐఆర్‌తో కలిసి కర్నూలు మెడికల్‌ కాలేజీలో కొత్త స్ట్రెయిన్‌ల జన్యుపరమైన వివరాలను తెలుసుకునేందుకు కొన్ని నమూనాలను పరీక్షించాం. అందులోనూ ఒక దక్షిణాఫ్రికా, రెండు యూకే స్ట్రెయిన్‌లను గుర్తించాం. అందుకే ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మా పరిశోధనల ప్రకారం... కొన్ని స్ట్రెయిన్‌లు వ్యాధినిరోధక శక్తిని తప్పించుకుని, వైద్యానికి సైతం లొంగకుండా శరీరంపై ప్రభావం చూపిస్తున్నట్లు తేలింది.

తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం ఎలా సన్నద్ధమవుతోంది?

రాష్ట్ర ప్రభుత్వం నుంచి జిల్లాలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్లాయి. కొవిడ్‌-19 పాజిటివ్‌ వ్యక్తుల్ని, వారితో సన్నిహితంగా ఉన్నవారిని గుర్తించాలని చెప్పాం. కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు మరింత పెంచాలని, పరీక్షా కేంద్రాల చిరునామాలు ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం చేయాలని డీఎంహెచ్‌వోలకు ఆదేశించాం. జిల్లాల్లో ఆరోగ్యసేతు యాప్‌ వాడకాన్ని పెంచాలనీ సూచించాం. పరిస్థితులు బాగున్నప్పుడే ఆసుపత్రుల్ని, సిబ్బందిని, వెంటిలేటర్లను, మందుల్ని సిద్ధం చేసుకుంటున్నాం. వైద్యులు మరింత ప్రావీణ్యం పొందేలా వెబినార్‌లు నిర్వహిస్తున్నాం.

మళ్లీ లాక్‌డౌన్‌ పరిస్థితులు వచ్చే అవకాశం ఉందా?

ఇప్పుడున్న పరిస్థితుల్లో లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు లేవు. సరిహద్దులు మూయడానికి కూడా సాధ్యంకాదు. తీవ్రతను బట్టి పాజిటివ్‌ కేసులున్న ఇల్లు, ప్రాంతం వరకు ఐసోలేట్‌ చేసేందుకు అవకాశముంది. పరిస్థితులకు అనుగుణంగా ఇతరత్రా పరిధుల్ని విధించుకోవడం లాంటివి చేస్తాం. దీనిపై క్షేత్రస్థాయి యంత్రాంగానికి స్పష్టమైన మార్గనిర్దేశాలు ఇచ్చేశాం. కొవిడ్‌-19 మన రాష్ట్రంలోకి ప్రవేశించి ఏడాది అవుతున్నా... దాని తీవ్రత ఏమాత్రం తగ్గడంలేదు. తీవ్రత మరీ ఎక్కువగా ఉన్నచోట్ల మాత్రం కంటైన్‌మెంట్‌జోన్‌ చేయాల్సిన అవసరం రావొచ్చు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.