ETV Bharat / city

ఆ విషయంలో మేమేమీ చేయలేం: సుప్రీంకోర్టు

author img

By

Published : Apr 9, 2021, 8:53 PM IST

దేశ‌వ్యాప్తంగా న్యాయవాదుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తెచ్చే అంశంపై కేంద్ర న్యాయ శాఖకే విన్నవించుకోవాలని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం సూచించింది. తెలంగాణలో న్యాయవాద దంపతుల హత్య నేపథ్యంలో దేశంలో న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తెచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్​పై సర్వోన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది.

supreme-court
సుప్రీంకోర్టు

తెలంగాణలో న్యాయవాద దంపతుల హత్య నేపథ్యంలో దేశవ్యాప్తంగా న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం తెచ్చేలా ఆదేశాలివ్వాలని కోరుతూ న్యాయవాది కాసోజు మహేశ్‌ చారి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్ఏ బాబ్డే నేతృత్వంలోని జ‌స్టిస్ బొపన్న‌, జస్టిస్ రామ‌సుబ్ర‌మ‌ణియ‌న్‌తో కూడిన‌ త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో దేశంలో న్యాయ‌వాద వృత్తిలో ఉన్న‌వారికి స‌రైన భ‌ద్ర‌తా లేద‌ని న్యాయ‌స్థానం దృష్టికి పిటిష‌నర్ తరఫు న్యాయవాది తీసుకెళ్లారు.

తెలంగాణ‌లో జ‌రిగిన అడ్వకేట్ దంప‌తుల హ‌త్య ఉదంత‌మే ఉదాహ‌ర‌ణ అని గుర్తు చేశారు. ఈ విషయంలో తామేమీ చేయలేమని.. చట్టం తీసుకొచ్చే అంశంపై న్యాయ శాఖను ఆశ్రయించాలని సీజేఐ ధ‌ర్మాస‌నం సూచించింది. సుప్రీంకోర్టు సూచనతో పిటిషనర్‌ మహేశ్‌ చారి తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

ఇదీ చూడండి:

రెండేళ్లుగా వైకాపా ఏం చేసిందో సమాధానం చెప్పాలి: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.