ETV Bharat / city

అప్పులు అంతకు మించే..కేంద్రం గుర్తించిన దాని కన్నా పరిస్థితి ఆందోళనకరం

ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ముప్పులో ఉందని సాక్షాత్తూ కేంద్రమే హెచ్చరించింది. శ్రీలంక పరిస్థితిని చూసైనా మేల్కొనాలని అప్రమత్తం చేసింది. దిల్లీలో మంగళవారం కేంద్రం చూపిన ప్రజంటేషన్‌లో లెక్కలు కొన్ని వెల్లడయ్యాయి. రాష్ట్రం అప్పులకు సంబంధించి అసలు లెక్కలకు, కేంద్రం పేర్కొన్న లెక్కలకు పొంతనే లేదని... అసలు లెక్కలు చూస్తే ఇక్కడి పరిస్థితి తీవ్రత అర్థమయ్యేదని నిపుణులు పేర్కొంటున్నారు.

ఆంధ్రప్రదేశ్‌
ఆంధ్రప్రదేశ్‌
author img

By

Published : Jul 21, 2022, 3:56 AM IST

ఆంధ్రప్రదేశ్‌ అప్పుల ముప్పులో ఉందని సాక్షాత్తూ కేంద్రమే హెచ్చరించింది. శ్రీలంక పరిస్థితిని చూసైనా మేల్కొనాలని అప్రమత్తం చేసింది. దిల్లీలో మంగళవారం కేంద్రం చూపిన ప్రజంటేషన్‌లో లెక్కలు కొన్ని వెల్లడయ్యాయి. రాష్ట్రం అప్పులకు సంబంధించి అసలు లెక్కలకు, కేంద్రం పేర్కొన్న లెక్కలకు పొంతనే లేదని... అసలు లెక్కలు చూస్తే ఇక్కడి పరిస్థితి తీవ్రత అర్థమయ్యేదని నిపుణులు పేర్కొంటున్నారు. ఏటా రాష్ట్ర జీఎస్‌డీపీలో అప్పులు 4%కు మించకూడదని ఆర్థిక సంఘం నిర్దేశించింది.

అన్ని అప్పులనూ కలిపి లెక్కిస్తే గుండె గుభేలుమంటుందని వారంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ లెక్కకు మించి అప్పులు చేస్తోందని, అప్పు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందని కాగ్‌ ఇప్పటికే హెచ్చరించింది. దిల్లీలో మంగళవారం కేంద్ర ఆర్థికశాఖ ప్రజంటేషన్‌ ఇచ్చే క్రమంలో కొద్దిసేపటి తర్వాత ఎంపీల విమర్శలతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. మొత్తం అప్పు రమారమి రూ.4.25 లక్షల కోట్లుగా పేర్కొన్నట్లు కొందరు చెబుతున్నారు. వాస్తవ లెక్కలు ఇంతకంటే చాలా ఎక్కువని అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో చూపకుండా ఈ మూడేళ్లలో చేసిన అప్పు రూ.28,837 కోట్లు అని కేంద్రం తన ప్రజంటేషన్‌లో పేర్కొంది. 2019-20 నుంచి 2021-22 వరకు ఉన్న గణాంకాల ఆధారంగా ఈ లెక్కలను చూపింది. బడ్జెటేతర రుణాలను బట్టి.. రాష్ట్రాలు ఏయే స్థానాల్లో ఉన్నాయో కేంద్రం పేర్కొంది. అందులో ఆంధ్రప్రదేశ్‌ మూడోస్థానంలో ఉన్నట్లు తేల్చింది. జీఎస్‌డీపీలో బడ్జెట్‌లో చూపని రుణాలు సుమారు 2.5% ఉన్నట్లు పేర్కొంది. రుణాల మొత్తం జీఎస్‌డీపీలో 4% దాటకూడదు. కేంద్రం లెక్కలు ఎలా తేల్చిందో కానీ, వాస్తవంగా బడ్జెటేతర రుణాలు అంతకుమించి ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ ద్వారా దాదాపు రూ.23,000 కోట్ల రుణం ఈ మూడేళ్లలోనే తీసుకున్నారు. ఇవికాకుండా గ్యారంటీలు ఇచ్చి కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న రుణాలు రూ.70వేల కోట్ల వరకు ఉన్నాయని అంచనా. నాన్‌ ఫైనాన్షియల్‌ సర్వీసు కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి దానికి డిపాజిట్లు మళ్లించి ప్రభుత్వం వినియోగించుకుంది. ఇలా బడ్జెట్‌లో చూపని రుణాలు రూ.లక్ష కోట్ల పైమాటేనన్నది ఆర్థిక నిపుణుల మాట. ఇందులో చాలా కార్పొరేషన్లు రుణాలు తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర బడ్జెట్‌ మాత్రమే ఆధారం. బడ్జెట్‌లో చూపకుండా రుణం పొంది తిరిగి రాష్ట్ర ప్రభుత్వమే ఏటా వడ్డీలు, అసలు రూపంలో చెల్లిస్తున్న మొత్తం రూ.15వేల కోట్లు ఉంటుందని ఒక అంచనా. దీనికి ఇంకా నాన్‌ గ్యారంటీ రుణాలు కలపాలి.

అవీ రాష్ట్ర అప్పులే!
కేంద్రం మంగళవారం మరో స్పష్టత ఇచ్చింది. రాష్ట్ర బడ్జెట్‌ నుంచి చెల్లించేది ఏదైనా రాష్ట్ర ప్రభుత్వ అప్పేనని పేర్కొంది. ‘ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లు, ఎస్పీవీ ద్వారా తీసుకున్న రుణాల అసలు, వడ్డీని రాష్ట్ర బడ్జెట్‌ నుంచి లేదా రాష్ట్రానికి వచ్చే పన్నుల ద్వారా చెల్లిస్తే వాటిని రాష్ట్రప్రభుత్వ రుణాలుగానే పరిగణిస్తాం’ అని ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి వెల్లడించారు. ప్రస్తుతం ఇలా అనేక కార్పొరేషన్ల ద్వారా రాష్ట్రం అప్పులు తెచ్చి వినియోగించుకుంటోంది. మద్యం డిపోల ఆదాయాన్ని ప్రభుత్వం ఎస్క్రో చేసి ఏపీఎస్‌డీసీ ద్వారా దాదాపు రూ.23వేల కోట్ల రుణం తీసుకుంది. దాన్ని అదనపు ఎక్సైజ్‌ సుంకంతో చెల్లిస్తామంది. దీన్ని రాష్ట్రప్రభుత్వ అప్పుగా చూపించడం లేదు. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థికశాఖ, రిజర్వుబ్యాంకు తప్పుపట్టాయి. తాజాగా బెవరేజస్‌ కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి, రూ.8,300 కోట్ల రుణం తీసుకుంది. ఆ అప్పు తీర్చేందుకు కార్పొరేషన్‌కే పన్నులు వసూలు చేసుకునే అధికారం ఇచ్చింది.

మొత్తం అప్పు రూ.4,39,394 కోట్లేనట: 2022-23 ఆర్థిక సంవత్సరం చివరినాటికి మొత్తం అప్పు రూ.4,39,394 కోట్లకు చేరుతుందన్నది రాష్ట్ర ప్రభుత్వం అంచనా. నిజానికి 2021-22 ఆర్థిక సంవత్సరం చివరికే రాష్ట్రం అప్పు ఎంతో భారంతో ఉంది. నిపుణుల లెక్కలు వేరే ఉన్నాయి.

..

ఇవీ చదవండి: CPI Narayana: చిరంజీవిపై వ్యాఖ్యలు.. సీపీఐ నేత నారాయణ పశ్చాత్తాపం

ఆకస్మిక వరదలు.. కొట్టుకుపోయిన 13 భవనాలు.. అధికారుల వార్నింగ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.