ETV Bharat / city

ధర వెలవెల...రైతు విలవిల!

పేదోడి పండుగా పిలిచే అరటికి ఇప్పుడు గడ్డురోజులు వచ్చాయి. గిట్టుబాటు ధరలేక దానిని సాగు చేస్తున్న రైతులు విలవిల్లాడుతున్నారు. రాయలసీమలో కిలో అరటి రూ.6లు పలుకుతుండగా...కోస్తాలో పెద్ద గెలలకు రూ.100 మాత్రమే ధర పలుకుతోంది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని అరటి రైతులు కోరుతున్నారు.

The price or the banana farmer's misery due to the lockdown
అరటి రైతు కుదేలు
author img

By

Published : May 3, 2020, 11:37 AM IST

అరటి రైతులకు మళ్లీ ధరల సెగ మొదలైంది. రాయలసీమలో రెండు మూడు రోజుల కిందట కిలో రూ.8 నుంచి రూ.9 వరకు పలికిన ధరలు.. ఇప్పుడు కిలో రూ.4 నుంచి రూ.6కు పడిపోయాయి. స్థానిక వినియోగ రకాల్లో కర్పూరం, భుషావలి రకాల గెలల ధరలు మరింత దిగజారాయి. వర్షాలు, ఈదురు గాలులకు పంట దెబ్బతింటుందనే భయంతో ఎంతకైనా ఇస్తారనే వ్యాపారులు ధరలు తగ్గిస్తున్నారని రైతులు వాపోతున్నారు. కిలోకు రూ.8 చొప్పున మద్దతు ధర ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు.

పెరిగి.. మళ్లీ తగ్గి

కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో ఎగుమతి రకాల అరటి సాగు చేస్తారు. లాక్‌డౌన్‌తో విదేశాలకు ఎగుమతులు నిలిచిపోయాయి. ఇతర రాష్ట్రాల మార్కెట్లు మూతపడ్డాయి. దీంతో వీటిని కొనే వారు లేక.. పొలాల్లోనే మగ్గిపోయాయి. తర్వాత ప్రభుత్వం కిలో రూ.3.50 చొప్పున కొనుగోలు చేయించి వివిధ మార్కెట్లకు పంపింది. తర్వాత ఇతర రాష్ట్రాల మార్కెట్లు తెరవడంతో ధర కాస్త పెరిగి.. కిలో రూ.8 నుంచి రూ.9 వరకు లభించింది. వారం రోజులుగా ఇది మందగించింది. తుపాను హెచ్చరికలు.. ఈదురుగాలులు, వర్షాలు కురుస్తుండటంతో కొన్నిచోట్ల అరటి నేల వాలుతోంది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఆలస్యమైతే ఈ ధరా దక్కదని అడిగినంతకు విక్రయిస్తున్నారు. కిలో రూ.4.30 చొప్పున అరటిని విక్రయించానని కడప జిల్లా వెలిగండ్ల రైతు రాఘవరెడ్డి వివరించారు. ఉత్తరాదిన మార్కెట్లు తీస్తే.. ధర పెరుగుతుందేమో అని కొందరు రైతులు ఎదురు చూస్తున్నారు.

మోయలేని గెల రూ. వందకిస్తాం

తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో కర్పూర రకం గెల లోడు(6గెలలు) గతంలో రూ.1,000 నుంచి రూ.1,200 ఉండేది. ఇప్పుడు రూ.200 నుంచి రూ.600కు పడిపోయింది. ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే భుషావలి రకం అరటి కొనేవారు లేరు. చిన్నగెలలైతే పొలాల్లోనే వదిలేస్తున్నారు. చక్కెర కేళీ అయితే అసలే అమ్మలేమని పేర్కొంటున్నారు. గుంటూరు జిల్లా కొల్లిపరలో చిన్న గెలలకు రూ.20.. పెద్దవైతే గరిష్ఠంగా రూ.120 వరకు ఇస్తున్నారు. ఇందులో గెలకు రూ.12 కమీషన్‌, రవాణా కింద రూ.6 నుంచి రూ.8 పోతే.. చిన్న గెలల రైతుకు ఏమీ మిగలదు. ‘మోయలేనంత గెల రూ.100కు ఇస్తా.. కావాలంటే తీసుకుపోండి’ అని తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం రైతు కె.శ్రీనివాసరెడ్డి చెబుతుండటం.. ధరల పతనానికి దర్పణంగా నిలుస్తోంది.

ఇవీ చదవండి...కరోనా పోరాట యోధులకు రక్షణ దళాల సంఘీభావం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.