ETV Bharat / city

సుప్రీం తీర్పుతో మొదలైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ - local elections in ap news

సుప్రీం తీర్పుతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. క్షేత్రస్థాయి అధికారులకు... ప్రాథమికంగా మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఎస్​ఈసీ ఆదేశాలకు అనుగుణంగా 2019కి చెందిన ఓటర్ల జాబితాలను సిద్ధం చేయటంతో పాటు... నామినేషన్ల కోసం తగు ఏర్పాట్లు మొదలుపెట్టారు. ఎస్​ఈసీ ఆదేశాల మేరకు.... గుంటూరు, చిత్తూరు కలెక్టర్లు సహా ఇతర అధికారులను బదిలీ చేయనున్నారు.

సుప్రీం తీర్పుతో మొదలైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ

author img

By

Published : Jan 26, 2021, 4:51 AM IST

సుప్రీం తీర్పుతో మొదలైన పంచాయతీ ఎన్నికల ప్రక్రియ

పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయినా సుప్రీంలో విచారణ పేరిట సహాయనిరాకరణ చేపట్టిన రాష్ట్ర ప్రభుత్వం.... సర్వోన్నత న్యాయస్థానం తీర్పుతో ఎన్నికలకు సిద్ధమైంది. ఎస్​ఈసీ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించింది. పంచాయతీ ఎన్నికలకు ఎస్​ఈసీ రీషెడ్యూల్ నోటిఫికేషన్ జారీ చేయటంతో తదనుగుణ చర్యలకు యంత్రాంగం ఏర్పాట్లు చేసుకుంటోంది. ఎన్నికల నిర్వహణపై సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌.. పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్‌లతో చర్చించారు. కొందరు కలెక్టర్లతోనూ మాట్లాడినట్టు సమాచారం. ఎస్​ఈసీ సూచనల మేరకు 2019 నాటి ఎన్నికల జాబితా సిద్ధం చేయాల్సిందిగా క్షేత్రస్థాయి సిబ్బందికి సూచించినట్టు తెలుస్తోంది.

రీషెడ్యూల్ నోటిఫికేషన్ జారీ చేసిన అనంతరం... కొందరు సీనియర్ మంత్రులు, సీఎస్ ఆదిత్యనాథ్ దాస్‌, డీజీపీ, ఏజీలతో సీఎం జగన్ భేటీ అయ్యారు. పంచాయతీ ఎన్నికలకు ప్రభుత్వం సహకరిస్తుందని మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ప్రకటించారు. మరోవైపు... గతంలో ఎన్నికల విధులు సరిగ్గా నిర్వర్తించని అధికారులను తప్పించేందుకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. అందుకు దస్త్రాలు సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.

వారి స్థానంలో విజిలెన్స్ క్లియరెన్స్ ఉన్న అధికారుల పేర్లను పంపాల్సిందిగా ఎస్​ఈసీ సూచించగా... ఆ ప్రకారమే ఆరుగురు ఐఏఎస్ అధికారులు, ముగ్గురు ఐపీఎస్​ల పేర్లను పంపేందుకు జాబితా రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. మరోవైపు..... పీఆర్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆ శాఖ కమిషనర్ గిరిజాశంకర్‌లను బదిలీ చేసేందుకు రంగం సిద్ధమైనట్టు సమాచారం. మంత్రి పెద్దిరెడ్డి ఈ అంశాన్ని ధ్రువీకరించారు. పోలింగ్ కేంద్రాలను, రిటర్నింగ్ అధికారుల జాబితాలను సిద్ధం చేయడం... పంచాయతీల్లో ఓటర్ల జాబితా ప్రదర్శన తదితర అంశాలపైనా ప్రాథమిక ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం.

ఇదీ చదవండీ.. ప్రజారోగ్యం కోసం ప్రభుత్వం చివరి వరకు పోరాడింది: సజ్జల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.