ETV Bharat / city

'నాకు న్యాయం చేయండి.. లేకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటా' - cm camp office latest news

పురుగుల మందు డబ్బాతో సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగో చెక్‌పోస్టు సిబ్బంది అతడిని తాడేపల్లి పోలీస్​స్టేషన్​కు తరలించారు.

The man creates distrubance at the CM's camp office
సీఎం కార్యాలయం వద్ద వ్యక్తి హల్​చల్​
author img

By

Published : Apr 17, 2021, 12:44 PM IST

గుంటూరు జిల్లా తాడేపల్లిలోని.. ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి పురుగుల మందు డబ్బాతో వెళ్లేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్నూలు జిల్లా గోనుగుండ్ల మండలం అల్వాలకు చెందిన వెంకటేశ్ అనారోగ్యం బారిన పడ్డారు.

సీఎంను కలిసి ఆర్థిక సాయం కోరేందుకు క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. తనకు న్యాయం జరగకపోతే అక్కడే పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. అప్రమత్తమైన నాలుగో చెక్ పోస్టు సిబ్బంది వెంకటేశ్​ను అదుపులోకి తీసుకొని తాడేపల్లి పోలీస్ స్టేషన్​లో అప్పగించారు.

ఇదీ చదవండి:

దేవినేని ఉమకు మరోసారి సీఐడీ అధికారుల నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.