ఏపీ వక్ఫ్ బోర్డు సీఈవోగా అబ్దుల్ ఖాదిర్ నియమాకాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై హైకోర్టు విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులకు నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాత చేపడతామని పేర్కొంది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గంగారావు ఈ మేరకు ఉత్తర్వులు జారీచేశారు.
అర్హత లేని వ్యక్తిని వక్ఫ్ బోర్డు ముఖ్య కార్యనిర్వహణ అధికారిగా నియమించారని, ఆయన నియామకానికి సంబంధించిన జీవోను రద్దు చేయాలని కోరుతూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ ఖాజావలి హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. వక్ఫ్ బోర్డు చట్టం సెక్షన్ 23 ప్రకారం .. డిప్యూటీ కార్యదర్శి హోదాకు తగిన వ్యక్తిని నియమించాల్సి ఉందని పిటిషనర్ తరఫున న్యాయవాది బషీర్ అహ్మద్ వాదనలు వినిపించారు.
ఇదీ చదవండి: Wakf Board Issue: వక్ఫ్ బోర్డు సభ్యుల నియామకాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వ్యాజ్యం