ETV Bharat / city

high court: ' కొవిడ్ ఆంక్షలను సక్రంగా అమలు చేయండి' - ప్రభుత్వానికి హైకోర్టు సూచన

రాష్ట్రంలో కొద్ది రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్నాయని హైకోర్టు పేర్కొంది. కొవిడ్ ఆంక్షలను సక్రమంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. తదుపరి విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది.

high court
high court
author img

By

Published : Sep 9, 2021, 4:02 AM IST

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య స్వల్పంగా పెరుగుతోందని హైకోర్టు (high court) పేర్కొంది. కొవిడ్ ఆంక్షలను సక్రమంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. కరోనాను ప్రజలు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని , మాస్కులు ధరించడం లేదని అమికస్ క్యూరీ వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపించారు. కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ప్రభుత్వం జీవోలు ఇస్తున్నా .. క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదన్నారు. మూడో దశ వ్యాప్తి ముప్పు పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారన్నారు.

మాస్కులు ధరించని వారికి రూ.వెయ్యి జరిమానా వేస్తున్నామన్నారని ప్రభుత్వ న్యాయవాది సుమన్ వాదనలు వినిపించారు. ఇరువైపు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ చర్యల పురోగతిని పరిశీలించేందకు విచారణను ఈ నెల 22 కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలిచ్చింది. కొవిడ్ కట్టడిపై చర్యలను హైకోర్టు పర్యవేక్షిస్తూ విచారణ జరుపుతుంది.

ఉపాధాయులకు టీకా పూర్తికాకుండానే...

50 % మంది ప్రభుత్వ ఉపాధ్యాయులకు మాత్రమే టీకాలు పూర్తి అయ్యాయని అమికస్ క్యూరీ వాదనలు వినిపించారు . మొత్తం ఉపాధ్యాయులకు పూర్తి కాకుండానే బడులు తెరిచారన్నారు. తర్వాత కొవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తంచేశారు . వినాయక చవితి నేపథ్యంలో విగ్రహాలు , మండపాల ఏర్పాటు విషయంలో డీజీపీ ఇచ్చిన ప్రొసీడింగ్స్ కఠినంగా అమలు చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మండపాలకు అనుమతిస్తే కరోనా కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో గణేశ్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతించడం లేదని ప్రభుత్వ న్యాయవాది సుమన్ తెలిపారు. కేంద్రం కేటాయించిన 31 ఆక్సిజన్ ప్లాంట్లలో 22 ఏర్పాటు చేశామని , అవి సేవలు అందిస్తున్నాయన్నారు . వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే టీకాల ప్రక్రియను వేగంగా నిర్వహిస్తున్నామన్నారు . పిటిషనర్ల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ ... రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులకు టీకా ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని కోరారు.

ఇదీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.