ETV Bharat / city

కరోనా పరీక్షల సంఖ్య పెంచే యోచనలో ప్రభుత్వం - ఏపీలో కరోనా ఆసుపత్రి వార్తలు

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నతరుణంలో.... వైద్య సదుపాయాలు పెంచేందుకు ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది. ఆస్పత్రుల్లో ఐసీయూ పడకలు పెంచడం సహా.. వీలైనన్ని వెంటిలేటర్లనూ సమకూర్చేందుకు ప్రయత్నిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ 10 వేల 505 నమూనాలు పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఇకనుంచి నమూనాల సేకరణ, నిర్ధరణ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచే యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.

The government is planning to increase the number of corona tests in ap state

author img

By

Published : Apr 15, 2020, 9:46 AM IST

కరోనా పరీక్షల సంఖ్య పెంచే యోచనలో ప్రభుత్వం

గణనీయంగా పెరుగుతున్న కరోనా పాజిటివ్ బాధితులకు చికిత్స అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే 4 ప్రైవేటు వైద్య కళాశాలలను కరోనా ప్రత్యేక ఆస్పత్రులుగా మార్చిన ప్రభుత్వం.. 13 జిల్లాల్లోని ఆస్పత్రుల్లోనూ ఐసీయూ పడకల సంఖ్య పెంచాలని నిర్ణయించింది. అవసరానికి తగ్గట్లు వెంటిలేటర్లనూ సమకూర్చుకోవాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. చిత్తూరు, నెల్లూరు, కృష్ణా, విశాఖ జిల్లాల్లోని రాష్ట్ర స్థాయి కరోనా ఆస్పత్రుల్లో.. 444 ఐసీయూ పడకలు, 444 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు వెల్లడించారు. 1370 నాన్ ఐసీయూ పడకలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.

13 జిల్లాల్లోని జిల్లా స్థాయి కరోనా ఆస్పత్రుల్లో 445 ఐసీయూ పడకలు, వెంటిలేటర్లు సిద్ధంగా ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. 8,950 నాన్ ఐసీయూ పడకలున్నాయని తెలిపారు. అన్ని జిల్లాల్లోనూ 4 వేల 799 మంది వైద్యులు, 16 వేల 481 మంది పారామెడికల్ సిబ్బంది, నర్సులు పనిచేస్తున్నట్టు ప్రకటించారు. మొత్తం లక్షా 3 వేల 750 పీపీఈ కిట్లు.. 98 వేలకు పైగా ఎన్​-95 మాస్కులు అందుబాటులో ఉన్నట్టు వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకూ 10,505 నమూనాలు పరీక్షించినట్లు అధికారులు వెల్లడించారు. ఇకపై రోజువారీ నమూనాల సేకరణ, నిర్ధరణ పరీక్షల సంఖ్య 990కి పెంచే యోచనలో ఉన్నట్లు చెప్పారు. 13 జిల్లాల్లో 338 క్వారంటైన్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. మొత్తం 59 వేల 686 పడకలు ఉన్నాయని తెలిపింది. ప్రస్తుతం క్వారంటైన్ కేంద్రాల్లో 5 వేల 864 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఇప్పటి వరకూ 3 దశల్లో కోటి 45 లక్షల కుటుంబాలను సర్వే చేసినట్టు.. వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. సింప్టోమాటిక్ సర్వేలో.. 22 వేల 272 మంది అనుమానితుల్ని పరీక్షించినట్లు అధికారులు తెలిపారు. వీరిలో 6,509 మందిని ఇళ్లలోనే క్వారంటైన్‌లో ఉంచి పర్యవేక్షిస్తున్నట్లు వెల్లడించారు. మరో 8 మందిని ఐసోలేషన్ కేంద్రాలకు తరలించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి:

లాక్​డౌన్​: సాయానికి కదిలిన కలిదిండి యువత

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.