new mining policy: కొత్త మైనింగ్ విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తోంది. ఇప్పటివరకు నిర్ధేశించిన ధర ప్రకారం ధర చెల్లిస్తూ వచ్చిన గుత్తేదారులు.. ఇక నుంచి మైనింగ్ లీజు దక్కించుకునేందుకు ఈ వేలంలో పాల్గొనాల్సి ఉంది. సహజసిద్ధ ఖనిజాలైన గ్రానైట్, నాప రాయి, రహదారి కంకర వేలానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు మైనర్ మినరల్స్‌ను గుత్తేదారులకు ప్రభుత్వం నిర్ధేశించిన ధర ప్రకారం గనుల శాఖాధికారులు అప్పజెప్పవారు. కానీ వీటిని కూడా ఈ వేలం ద్వారా అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మేరకు ఏయే ఖనిజానికి ఎంత ధర ఉండాలనే దానిపైనా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అయితే ఇప్పటికే ఈ వ్యాపారంలో ఉన్న గుత్తేదారులకు ప్రాధాన్యం ఇవ్వాలని మైనర్ మినరల్స్ పరిశ్రమల సమాఖ్య డిమాండ్ చేస్తోంది.
ఇదీ చదవండి: Financial Planning: మార్చి 31 సమీపిస్తోంది.. ఈ పనులన్నీ పూర్తి చేశారా?