ETV Bharat / city

'జీతాల విషయంలో ఇప్పటికే జీవో ఇచ్చాం' - andhrapradesh high court news

న్యాయశాఖ ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లింపు పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. జీతాల విషయంపై విచారణ జరపాల్సిన అవసరం ఏముందని కోర్టు అభిప్రాయపడింది.

The government has told the High Court that it will pay full salaries to government employees as well as judicial employees.
'జీతాల విషయంలో ఇప్పటికే జీవో ఇచ్చాం'
author img

By

Published : May 27, 2020, 12:02 PM IST

ప్రభుత్వ ఉద్యోగులతో పాటు జ్యుడీషియల్ (న్యాయశాఖ) ఉద్యోగులకు పూర్తి జీతాలు చెల్లించనున్నట్లు ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఈ విషయమై జీవో జారీ చేశామని ప్రభుత్వ న్యాయవాది సుమన్ తెలిపారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం... జీతాల విషయంపై విచారణ జరపాల్సిన అవసరం ఏముందని అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ వ్యాజ్యాల్లో కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను జూన్ 22 కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాణి కుమార్, జస్టిస్ సురేశ్ రెడ్డితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. పూర్తి జీతాలు చెల్లించకపోవటాన్ని సవాలు చేస్తూ విశ్రాంత జిల్లా జడ్జి లక్ష్మీకామేశ్వరి, దిగువ కోర్టులో సీనియర్ అసిస్టెంట్​గా పనిచేస్తున్న లక్ష్మీ నరసింహమూర్తి దాఖలు చేసిన వ్యాజ్యాలు హైకోర్టులో విచారణకు వచ్చాయి.

ఇవీ చదవండి: చంద్రబాబు నాయుడు, లోకేష్​లపై హైకోర్టులో వ్యాజ్యం దాఖలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.