గత ఆర్థిక సంవత్సరం చివరి రోజున దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా వివిధ బిల్లులకు సంబంధించిన మొత్తాలు చెల్లించేందుకు రిజర్వు బ్యాంకుకు (ఆర్‌బీఐ) ప్రతిపాదనలు పంపినా చివరి నిమిషంలో చేరడంలో ఇబ్బందులేర్పడ్డాయని తెలిసింది. అర్ధరాత్రి 12 గంటలు దాటాక ఆర్థిక సంవత్సరం మారడంతో ఆ బిల్లులను ఆర్‌బీఐ వెనక్కు పంపిందని సమాచారం. దీంతో ప్రత్యామ్నాయ మార్గాల్లో ఈ మొత్తం చెల్లింపునకు ఆర్థిక శాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం.
ఖజానా, సీఎఫ్‌ఎంఎస్, పే అండ్ అకౌంట్స్ అధికారులతో మాట్లాడి ఈ బిల్లుల చెల్లింపునకు సస్పెన్స్ ఖాతాను ఎంచుకోవాలని సూచించినట్లు తెలిసింది. సంబంధిత ప్రధాన పద్దు నుంచి (హెడ్ ఆఫ్ అకౌంట్) నిధులను సస్పెన్స్ ఖాతాకు మళ్లించి రూ.వెయ్యి కోట్లకుపైగా బిల్లులు చెల్లించేందుకు కసరత్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: