కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, కరోనాతో యుద్ధం చేస్తామంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే రీతిలో పాట రాసిన నిస్సార్... చివరికి మహమ్మారి కరోనాకే బలయ్యారు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గం సుద్దాలకు చెందిన రచయిత, గాయకుడు నిస్సార్ బుధవారం తెల్లవారు జామున గాంధీలో మృతిచెందారు.
ఆయన రాసిన 'కరోనా నీతో యుద్ధం చేస్తాం మా భారత భూభాగాన' పాట ఇటీవల ప్రజల్లోకి బాగా వెళ్లింది. నిస్సార్ రాసిన ఈ పాటను సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ ఆలపించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన రాసిన పాటలకు విశేష ఆదరణ లభించింది. ప్రజారచయిత కరోనా బారినపడి మృతి చెందడం పట్ల రాజకీయ ప్రముఖులు, ఆయన అభిమానులు, సాహితీవేత్తలు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి : గుడ్ న్యూస్: ఆగస్టు వరకు పీఎఫ్ భారం కేంద్రానిదే