ETV Bharat / city

10నెలల అప్పు...రూ.73,913కోట్లు!

author img

By

Published : Mar 3, 2021, 4:53 AM IST

రాష్ట్రంపై అప్పుల భారం పెరుగుతూనే ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలో పది నెలల లెక్కలను కాగ్ నిన్న రాత్రి విడుదల చేసింది. జనవరి నెలాఖరుకు రాష్ట్రంలో 73వేల912 కోట్లకుపైగా అప్పుల రూపంలోనే సమకూర్చుకోవాల్సి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర రుణ అంచనాలతో పోలిస్తే ఇది రెట్టింపును దాటిపోయింది.

CAG report on AP debts
అప్పుల్లో దేశంలోనే నాలుగో స్థానంలో రాష్ట్రం

రాష్ట్రంలపై రోజురోజుకూ అప్పుల భారం పెరుగుతూనే ఉన్న విషయం.... కాగ్ తాజా లెక్కలతో మరోసారి నిరూపితమైంది. కరోనా వల్ల రెవెన్యూ ఆదాయం తగ్గిపోవటంతో ప్రారంభంలో అప్పులు తప్పలేదని చెబుతున్నా.... రెవెన్యూ రాబడి గత ఆర్థిక సంవత్సరం కన్నా ఇప్పుడు ఎక్కువేనని కాగ్‌ లెక్కలే అంటున్నాయి.

రాబడి పెరిగినా...అప్పులూ అధికమే

2019-20 ఆర్థిక సంవత్సరంలో జనవరి నెలాఖరు వరకూ రెవెన్యూ రాబడి 85వేల987 కోట్లకుపైగా ఉంటే.... ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో అది 88వేల 238 కోట్లకుపైగా ఉంది. రుణాల విషయానికి వస్తే... కిందటి ఆర్థిక సంవత్సరం జనవరి నెలాఖరుకు 46వేల503 కోట్ల అప్పు చేస్తే.... ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో అది ఏకంగా 73వేల 912 కోట్లకుపైగా పెరిగింది. నాటి అప్పు అంచనాలతో పోలిస్తే 131 శాతం.... ప్రస్తుత సంవత్సర అంచనాల కన్నా 153 శాతం అధికంగా ఉంది. రాష్ట్రంలో జనవరి నెలాఖరు వరకూ రెవెన్యూ ఖర్చు, పెట్టుబడి వ్యయం కలిపి లక్షా 61వేల 833 కోట్లు వెచ్చించారు. 100 రూపాయలు ఖర్చు చేస్తే అందులో 45 రూపాయలు అప్పుల రూపంలోనే సమకూర్చుకోవాల్సి వచ్చింది. మిగిలినది రెవెన్యూ రాబడి.

గుదిబండగా రెవెన్యూ లోటు

ఈ ఏడాది రెవెన్యూ లోటు గుదిబండలా మారుతోంది. రెవెన్యూ రాబడి కన్నా రెవెన్యూ ఖర్చులు పెరగడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ఎప్పటికప్పుడు రెవెన్యూ లోటు తగ్గించుకుంటూ వస్తామని ప్రభుత్వాలు చెబుతున్నా... పరిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటున్నాయి. ఈ ఏడాది 54వేల 46 కోట్ల రూపాయల మేర రెవెన్యూ లోటు ఏర్పడింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్‌ అంచనాల మేరకు దాన్ని 18వేల434 కోట్లకే పరిమితం చేస్తామని ఆర్థికశాఖ వాగ్దానం చేసింది. కిందటి ఏడాది అది 34వేల690 కోట్లు మాత్రమే..!

పెట్టుబడి వ్యయం మెరుగ్గా..

కిందటి ఏడాదితో పోలిస్తే ప్రస్తుతం పెట్టుబడి వ్యయం పెరిగింది. భవిష్యత్తులో ఆదాయాలు కల్పించే వనరులపై వ్యయం చేస్తే... దాన్ని పెట్టుబడి వ్యయంగా పేర్కొంటారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది 19వేల547 కోట్లు చేశారు. కిందటి ఆర్థిక సంవత్సరంలో కేవలం 7వేల297 కోట్లే..!.

మూడూ వాడేశారు

బహిరంగ మార్కెట్‌ నుంచి అప్పులు తీసుకోవడంలో.... దేశంలో ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో నిలిచింది. రిజర్వు బ్యాంకు మంగళవారం విడుదల చేసిన బులెటిన్‌ ప్రకారం 2020 ఏప్రిల్‌ నుంచి డిసెంబరు వరకు ఆంధ్రప్రదేశ్‌ 44వేల250 కోట్ల రుణాలను బహిరంగ మార్కెట్‌ నుంచి సేకరించింది. రాష్ట్ర ప్రభుత్వం.... డిసెంబరులో 30 రోజులపాటు స్పెషల్‌ డ్రాయింగ్‌ సౌకర్యం, 26 రోజుల పాటు చేబదుళ్లు, 3 రోజులపాటు ఓవర్‌డ్రాఫ్ట్‌ సౌకర్యాన్ని ఉపయోగించుకుంది. నెలవారీగా బహిరంగ మార్కెట్‌ నుంచి రుణాలు తీసుకున్నాక కూడా రాష్ట్ర ఆర్థిక అవసరాలు తీరకపోతే ప్రభుత్వాలు ఈ మూడింటిలో ఏదో ఒక సౌకర్యాన్ని వాడుకొని ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతుంటాయి. అలా కాకుండా మూడింటినీ ఒకదాని తర్వాత ఒకటి వాడుకోవడం..... ప్రభుత్వ ఆర్థిక ఇబ్బందుల తీవ్రతకు అద్దం పడుతోంది. డిసెంబరు నాటికి ఏపీ ప్రభుత్వం... గత ఏడాది 12 నెలల్లో తీసుకున్న దానికంటే 4.3 శాతం అధికంగా అప్పు చేసింది.

ఇదీ చదవండి:

'గ్రామాల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తోంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.