ETV Bharat / city

సెనగకు రూ.130 మద్దతు పెంచిన కేంద్రం.. కొనుగోలుకు నోచుకునేనా? - msp for The center has raised Rs 130 crore support for daal

కేంద్రం సెనగకు రూ.130 మద్దతు ధర పెంచింది. అయితే పెట్టుబడితో పోలిస్తే మాత్రం రైతుకు ఏమాత్రం దక్కేలా లేదు. మద్దతు ధర పెంచినప్పటికీ కేంద్రం కొనుగోలు చేస్తుందా? అనేది అనుమానమే. ఎందుకంటే కొన్నేండ్లుగా మొత్తం ఉత్పత్తిలో 25% కూడా కొనుగోలుకు నోచుకోవడం లేదు.

The center has raised Rs 130 crore support for daal

author img

By

Published : Sep 9, 2021, 10:38 AM IST

సెనగలకు మద్దతు ధర క్వింటాలుకు రూ.130 పెంచుతున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో క్వింటాలు ధర రూ.5,230 అవుతుంది. రాష్ట్రంలో ఎకరాకు సగటు దిగుబడి నాలుగు క్వింటాళ్ల ప్రకారం చూస్తే.. రైతుకు లభించేది రూ.21వేలు మాత్రమే. ఎకరా కౌలు ధరలే రూ.15వేలు పైబడిన పరిస్థితుల్లో.. రైతుకు పెట్టుబడి ఖర్చులు కూడా రావడం కష్టమే. మద్దతు ధర పెంచుతున్నట్లు ఘనంగా ప్రకటించినా.. కొనుగోలు చేసేది నామమాత్రమే. మొత్తం ఉత్పత్తిలో 25% కూడా కొనుగోలుకు నోచుకోవడం లేదు. వచ్చే రబీకి సంబంధించి కేంద్రం బుధవారం మద్దతు ధరలు ప్రకటించింది. ఇందులో సెనగ పంటను రాష్ట్రంలో 11 లక్షల ఎకరాలకు పైగా సాగు చేస్తారు. రబీలో వరి తర్వాత సాగయ్యే ప్రధాన పంట ఇదే. కర్నూలు, కడప, ప్రకాశం, అనంతపురం జిల్లాల్లో అధికంగా సాగు చేస్తారు.

రూ.12వేల పెట్టుబడితో.. ఎకరా సాగు సాధ్యమా?

సేద్యం, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కౌలు, నూర్పిడి, పెట్టుబడిపై వడ్డీ, కుటుంబ శ్రమ అన్నీ కలిపితే సెనగల సగటు ఉత్పత్తి వ్యయం క్వింటాలుకు రూ.3,004 చొప్పున అవుతుందని కేంద్రం పేర్కొంది. రాష్ట్రంలో గత అయిదేళ్లలో వచ్చిన దిగుబడుల్ని చూస్తే సగటున ఏడాదికి 4 క్వింటాళ్లు మాత్రమే. అంటే కేంద్రం లెక్కలో ఎకరాకు మొత్తం అయ్యే పెట్టుబడి రూ.12,016. వాస్తవానికి సెనగ సాగుకు ఎకరాకు రూ.25వేల నుంచి రూ.40వేల వరకు అవుతోంది. ఎకరా కౌలు రూ.10వేల నుంచి రూ.15వేల మధ్య ఉంది. నల్లరేగడి నేలలు అయితే రూ.18 వేల చొప్పున కౌలుకు తీసుకుంటున్నారు. ఎకరానికి అర క్వింటాలు చొప్పున విత్తనాలకే రూ.5వేల వరకు అవుతున్నాయి. కూలీ ఖర్చులు, ఎరువులు, పురుగుమందుల ధరలూ పెరిగాయి. ఎకరా నూర్పిడికి రూ.3వేల వరకు అవుతుంది.

గిట్టుబాటు కాక.. మద్దతు ధరకూ అమ్ముకోలేక

ప్రభుత్వం మద్దతు ధరపై పంటల్ని కొనుగోలు చేస్తే రైతులు ముందుకొచ్చి అమ్ముకుంటారు. అయితే సెనగ రైతుల పరిస్థితి భిన్నంగా ఉంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరపై అమ్ముకుంటే పెట్టుబడులూ వచ్చే పరిస్థితి లేదు. దీంతో ధర పెరుగుతుందేమో అనే ఆశతో.. నెలల తరబడి శీతల గోదాముల్లో నిల్వ ఉంచి వడ్డీలు కట్టలేక సతమతం అవుతున్నారు. గోదాముల్లో నిల్వకు ఏడాదికి క్వింటాలుకు రూ.130 నుంచి రూ.150 చొప్పున చెల్లించాల్సి వస్తోంది. రాష్ట్రంలో ఏటా 50 లక్షల క్వింటాళ్ల సెనగ ఉత్పత్తి అవుతోంది. మద్దతు ధర ప్రకటనలకే పరిమితమవుతున్న కేంద్రం 25% పంటను కూడా కొనుగోలు చేయడం లేదు. గత మూడేళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కొనుగోళ్లు 20 లక్షల క్వింటాళ్లూ మించలేదు. గడిచిన రబీలో పండించిన సెనగలు ఇప్పటికీ గోదాముల్లోనే ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ధర ఇస్తే.. కొంతమేర ప్రయోజనం లభిస్తుందని రైతులు పేర్కొంటున్నారు.

.

ఇదీ చదవండి: తాత్కాలిక వైద్యులకు వేతనాల్లేవు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.