Obulapuram Mining Case: ఓబుళాపురం గనుల మైనింగ్ కేసులో.. నిందితుల డిశ్చార్జ్ పిటిషన్లు సీబీఐ న్యాయస్థానం కొట్టివేసింది. ఓఎంసీ కేసు నుంచి తొలగించాలన్న మంత్రి సబిత అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి డిశ్చార్జ్ పిటిషన్‌ను కొట్టివేసింది. ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్.. విశ్రాంత అధికారులు కృపానందం, వి.డి.రాజగోపాల్.. గాలి జనార్దన్‌రెడ్డి పీఏ అలీఖాన్ డిశ్చార్జ్ పిటిషన్ సీబీఐ కోర్టు కొట్టివేసింది.
ఈ కేసులో గతంలోనే గాలి జనార్ధన్‌రెడ్డి డిశ్చార్జ్ పిటిషన్ వెనక్కి తీసుకున్నారు. ఇక అభియోగాల నమోదుపై విచారణను ఈ నెల 21కి కోర్టు వాయిదా వేసింది. సుప్రీంకోర్టు జోక్యంతో.. ఓబుళాపురం గనుల మైనింగ్ కేసు విచారణ ప్రక్రియ.. వేగవంతమైంది.
ఇవీ చదవండి: