ETV Bharat / city

CAG: విద్యుత్‌ బకాయిలకు మినహాయించుకోవడం రాజ్యాంగ విరుద్ధం: కాగ్‌ - AP government have dried up CAG Report

CAG Reports: పంచాయతీరాజ్‌ సంస్థల రాబడి నుంచి నేరుగా మూలం వద్దే విద్యుత్తు బకాయిలను తగ్గించుకోవడం రాజ్యాంగస్ఫూర్తికి విరుద్ధమని కాగ్‌ తప్పుబట్టింది. రాష్ట్రంలో 10 వేల 597 ప్రత్యేక బిల్లుల ద్వారా 854.19 కోట్లు ఇలా మినహాయించుకున్నట్లు పేర్కొంది. కేంద్రం నిధులను పీడీ ఖాతాలకు మళ్లించి వాటిని సరిగా వినియోగించుకోవట్లేదని కాగ్‌ వెల్లడించింది. బడ్జెట్‌ కేటాయింపులు లేకుండానే ఏడు కేసుల్లో లక్షా 6 వేల 280.90 కోట్లు ఖర్చుచేశారని కాగ్‌ తప్పుబట్టింది.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/22-September-2022/16438939_cag.jpg
http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/22-September-2022/16438939_cag.jpg
author img

By

Published : Sep 22, 2022, 7:34 AM IST

Updated : Sep 22, 2022, 8:41 AM IST

CAG Allocations: పంచాయతీల ఆదాయాన్ని విద్యుత్‌ బకాయిలకు మినహాయించుకోవడం రాజ్యాంగ విరుద్ధమని కాగ్‌ వ్యాఖ్యానించింది. ఆంధ్రప్రదేశ్‌ ట్రెజరీ కోడ్‌లోని ప్రత్యేక బిల్లుల ద్వారా 2020-21 ఆర్థిక సంవత్సరంలో 48 వేల284.31 కోట్ల రూపాయల చెల్లింపులు జరిపారని కాగ్‌ తప్పుబట్టింది. సీఎఫ్‌ఎంఎస్‌ బ్యాక్‌ ఎండ్‌ ద్వారా ప్రాసెస్‌ చేశారని ప్రాథమిక పరిశీలనలో వెల్లడైనట్లు పేర్కొంది. ఈ ప్రత్యేక బిల్లులను పరిశీలిస్తే అనేక లోపాలు వెలుగుచూశాయని నివేదిక ప్రస్తావించింది.

ఏపీ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ సేకరించిన 10 వేల 895.67 కోట్ల రుణాలను 15 ప్రత్యేక బిల్లుల ద్వారా ఉపసంహరించి రాష్ట్ర సంఘటిత నిధికి తిరిగి సర్దుబాటు చేశారన్న కాగ్‌.... అదే మొత్తాన్ని ఏపీఎస్‌డీసీ పీడీ ఖాతా నుంచి మూడు ప్రత్యేక బిల్లుల ద్వారా 8 కార్పొరేషన్ల పీడీ ఖాతాలకు బదిలీచేశారని తెలిపింది.

విద్యుత్‌ బకాయిలకు మినహాయించుకోవడం రాజ్యాంగ విరుద్ధం: కాగ్‌


ఆంధ్రప్రదేశ్‌లో పీడీ ఖాతాలకు పెద్దమొత్తంలో నిధులను బదిలీ చేసినట్లు చూపుతున్నా ఆ నిధులు అక్కడ లేకపోవడంతో వాటిని సిబ్బంది ఖర్చు చేసుకోలేకపోతున్నారని కాగ్‌ పేర్కొంది. ఒకవైపు రాష్ట్రంలో భారీగా రెవెన్యూ లోటు కనిపిస్తుంటే మరోవైపు బడ్జెట్‌ కేటాయింపుల్లో మూడోవంతు పీడీ ఖాతాల్లో మిగిలిపోయినట్లు చూపుతున్నారని తప్పుబట్టింది.

సంఘటిత నిధి నుంచి నిధులను పీడీ ఖాతాలకు బదిలీ చేసి, ఆ నిధులు ఖర్చు చేయకపోవడంతో ఖర్చు ఎక్కువ చేసి చూపినట్లవుతోందని తెలిపింది. వీటిపై శాసనపరమైన పరిశీలన లోపించిందన్నకాగ్‌.. బడ్జెట్‌ ప్రక్రియ పవిత్రతను కాపాడుకునేందుకు పీడీ ఖాతాలను తగ్గించడం అవసరమని పేర్కొంది. రాష్ట్ర పథకాలు, కార్యకలాపాల అమలుకు పీడీ నిర్వాహకుల వద్ద నిధులను ఉంచడం ఆంధ్రప్రదేశ్‌ ఫైనాన్షియల్‌ కోడ్‌కు విరుద్ధమని కాగ్‌ స్పష్టం చేసింది.


బడ్జెట్‌ కేటాయింపులు లేకుండానే ఏడు కేసుల్లో లక్షా 6 వేల 280.90 కోట్లు ఖర్చుచేశారని కాగ్‌ తప్పుబట్టింది. దీనివల్ల బడ్జెట్‌ ప్రక్రియ గౌరవాన్ని, శాసనసభ నియంత్రణను బలహీనపరిచినట్లయిందని అభిప్రాయపడింది. నిధుల ఆవశ్యకత లేదని ముందుగా ఊహించినప్పుడు వెంటనే తమ ఆధీనంలో ఉన్న గ్రాంట్లలో మిగుళ్లను నియంత్రణాధికారులు ఆర్థికశాఖకు అప్పగించాలన్న కాగ్‌... 23 కేసులను పరిశీలించగా 39 వేల 960.97 కోట్ల మిగుళ్లకు 19 వేల 44.43 కోట్లే అప్పగించారని తెలిపింది.

రెండు గ్రాంట్లలో మిగుళ్ల కన్నా అధికంగా 4 వేల 614 కోట్లు అప్పగించినట్లు తేలిందని కాగ్‌ పేర్కొంది. కేంద్రం తన పథకాలకు అందిస్తున్న నిధులను.. రాష్ట్ర ప్రభుత్వం పీడీ ఖాతాలకు మళ్లించి వాటిని సరిగా వినియోగించుకోవట్లేదని కాగ్‌ తప్పుబట్టింది. దీనివల్ల కేంద్ర పథకాలు సరిగా అమలు కావట్లేదని, ఆ మరుసటి ఏడాది నిధులు సవ్యంగా వచ్చే పరిస్థితి లేకుండా పోయిందని కాగ్‌ పేర్కొంది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 22, 2022, 8:41 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.