ETV Bharat / city

'షూ'లో పక్షిగూడు.. ఆకట్టుకునేట్టు నెమలి చెట్టు

author img

By

Published : Apr 22, 2022, 1:03 PM IST

కాంక్రీట్ జంగిల్‌గా మారిన పట్టణాల్లో రమణీయమైన ప్రకృతిని చూడాలనుకోవడం ఇప్పుడున్న పరిస్థితుల్లో కాస్త పెద్ద కోరికే. కానీ అప్పుడప్పుడు మాత్రం ఏదో ఓ చోట కళ్లను కట్టిపడేసే.. మనసుకు ఆహ్లాదం కలిగించే దృశ్యాలు కనిపిస్తాయి. అలాంటి దృశ్యాలే తెలంగాణలోని నారాయణపేట జిల్లా పులిమామిడిలో.. జనగామ జిల్లా కలెక్టరేట్‌లో కనువిందు చేశాయి.

'షూ'లో పక్షిగూడు.. ఆకట్టుకునేట్టు నెమలి చెట్టు
'షూ'లో పక్షిగూడు.. ఆకట్టుకునేట్టు నెమలి చెట్టు

Peacock Tree : పై భాగం ఎండిపోయి, కింద పచ్చదనంతో కనిపిస్తున్న ఈ వృక్షం పేరు ‘నెమలి’. పైన ఎండిపోయినవన్నీ కాయలు. కింద పచ్చగా ఉన్నవి ఆకులు.తెలంగాణలోని నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం పులిమామిడి నుంచి చిన్నపొర్లకు వెళ్లే మార్గంలోని ఈ నెమలి చెట్టు చూపరులను ఇట్టే ఆకట్టుకుంటోంది.

Bird Nest : పక్షులకు చెట్టూచేమలే ఆవాసాలుగా ఉండేవి. పట్టణీకరణ నేపథ్యంలో ఇప్పుడవి అంతరిస్తుండడంతో పక్షులు ఇళ్లనే ఆవాసాలుగా చేసుకుంటున్నాయి. వాటికి ఎక్కడ భద్రంగా అనిపిస్తుందో అక్కడే గూడును ఏర్పరచుకుంటున్నాయి. ఇందుకు నిదర్శనమే ఈ చిత్రం. తెలంగాణలోని జనగామ జిల్లా కలెక్టరేట్‌ ఆవరణలో ఈవీఎంలను భద్రపరిచే గోదాము ఉంది. దానికి నిత్యం పోలీసు సిబ్బంది కాపలాగా ఉంటారు. వారిలో ఒకరి పాత పాదరక్ష(బూటు) గోదాము ఆవరణలో పడి ఉంది. అందులో ఓ పక్షి కొన్ని రోజులుగా గూడు నిర్మించుకుంది. అనువైన ప్రదేశంగా భావించిన పక్షి తాజాగా ఇక్కడే మరో రెండు పిల్లలకు జన్మనిచ్చింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.