ETV Bharat / city

ప్రకృతి రమణీయం.. సారంగాపూర్​ అటవీ సోయగం - jagtial district news

ఎటు చూసినా దట్టమైన వృక్షాలు.. ఆహ్లాదాన్ని పంచే పచ్చదనం.. మధ్యలో పచ్చని దుప్పటిని కప్పుకున్నట్లున్న ఎత్తైన కొండలతో తెలంగాణలోని జగిత్యాల జిల్లా సారంగాపూర్​ అడవి కనువిందు చేస్తోంది. ఓ వైపు అటవీ అందాలు.. మరోవైపు బీర్​పూర్​ గుట్ట సోయగాలు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తున్నాయి.

jagtial-district telangana
jagtial-district telangana
author img

By

Published : Oct 18, 2020, 6:06 PM IST

ప్రకృతి రమణీయం.. సారంగాపూర్​ అటవీ సోయగం

పచ్చని చెట్లు.. నిండుగా ఉన్న చెరువులతో.. తెలంగాణలోని జగిత్యాల జిల్లా ముగ్ధమనోహరంగా మారింది. దట్టమైన వృక్షాలతో పచ్చదనాన్ని పరుచుకున్న సారంగాపూర్​ అడవి ప్రకృతి ప్రేమికులను మైమరపిస్తోంది.

చుట్టుపక్కల భారీ వృక్షాలతో అటవీ మార్గంలో వొంపులు తిరుగుతూ ఉన్న రహదారి ఆవైపు వెళ్లే ప్రయాణికులకు కనువిందు చేస్తోంది. పచ్చదనంతో విరబూసిన ఈ అటవీ ప్రాంతంలో కాసేపు సేదతీరేందుకు వచ్చే ప్రకృతి ప్రేమికులు ఆహ్లాదాన్ని పొందుతున్నారు.

ఇదీ చదవండి :

తెలుగు యువ ఐఏఎస్‌ అధికారికి అరుదైన అవకాశం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.