ETV Bharat / city

ఇతర రాష్ట్రాల నుంచి 3 మద్యం సీసాలు తీసుకురావొచ్చు: హైకోర్టు

రాష్ట్రం వెలుపల లేకుంటే... లోపల కొనుగోలు చేసిన 3 మద్యం బాటిళ్లు ఓ వ్యక్తి కలిగి ఉండవచ్చని.... వేరే రాష్ట్రంలో కొన్న 3 బాటిళ్లను రాష్ట్రంలోకి తీసుకురావడం నేరం కాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది . పొరుగు రాష్ట్రం నుంచి ఏపీలోకి మద్యం తీసుకొస్తున్నారని పేర్కొంటూ ప్రభుత్వం కేసులు నమోదు చేయడం చట్ట విరుద్ధం అని తేల్చి చెప్పింది . రంపచోడవరం పోలీసులు.... కె.శ్రీనివాసులు సహా మరో నలుగురిపై నమోదు చేసిన కేసును రద్దు చేసింది. వారి వాహనాన్ని తక్షణం విడిచి పెట్టాలని ఆదేశించింది.

The-ap-high-court-has-ruled-in-favor-of-allowing-persons-to-bring-liquor-from-other-states
ఏపీ హైకోర్టు
author img

By

Published : Sep 2, 2020, 12:37 PM IST

Updated : Sep 3, 2020, 6:18 AM IST

మద్యం రవాణా చేస్తున్నారనే కారణంతో రంపచోడవరం, జగ్గయ్యపేట పోలీసులు ఏపీ ఎక్సైజ్ సవరణ చట్టం -2020లోని సెక్షన్ 34 (ఎ) ప్రకారం కేసులు నమోదు చేసి వాహనాలను సీజ్ చేయడాన్ని సవాలు చేస్తూ కొందరు వేర్వేరుగా రెండు వ్యాజ్యాలు హైకోర్టులో దాఖలు చేశారు . వీటిపై ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరపున న్యాయవాదులు జి.వెంకటేశ్వరరావు, పి.రాజశేఖర్ వాదనలు వినిపించారు. 2010 సెప్టెంబర్ 24 న ఎక్సైజ్ శాఖ జారీచేసిన జీవో 411 కు విరుద్ధంగా పోలీసులు కేసు నమోదు చేశారని.... ఆ జీవో ప్రకారం ఎప్పుడైనా ఎలాంటి అనుమతి , లైసెన్స్ లేకుండా...పరిమాణంతో సంబంధం లేకుండా ఓ వ్యక్తి గరిష్ఠంగా 3 ఐ.ఎస్​.ఎమ్​.ఎల్​ బాటిళ్లు కలిగి ఉండొచ్చన్నారు. ప్రస్తుత వ్యాజ్యాల్లో సదురు వ్యక్తి 3 బాటిళ్లకు లోపు మద్యాన్ని కలిగి ఉన్నప్పటికీ పోలీసులు కేసు నమోదు చేశారన్నారు . పొరుగురాష్ట్రంలో మద్యం కొనుగోలు చేసి ఒకసారి పన్ను చెల్లించాక వాటి పై ఏపీ ప్రభుత్వం ఎలాంటి షరతులు పెట్టడానికి వీల్లేదన్నారు . నిర్దిష్ట పరిమాణంలో మద్యం తీసుకెళ్లేందుకు చట్టం అనుమతిస్తోందని వాదించారు.

మద్యం వర్తకం, వినియోగం, రవాణా విషయంలో సహేతుకమైన షరతులున్నాయని ఎక్సైజ్ శాఖ తరపు న్యాయవాది వాదించారు. ఏపీ లోపల కొనుగోలు చేసిన 3 మద్యం బాటిళ్లను మాత్రమే ఓ వ్యక్తి కలిగి ఉండటానికి వీలుందని.. ఏపీకి వెలుపల కొనుగోలు చేసి మద్యాన్ని రాష్ట్రంలోకి దిగుమతి చేసిన మద్యంగా భావించాల్సి ఉంటుందన్నారు . మద్యాన్ని రాష్ట్ర ఆంశంగా రాజ్యాంగంలో పేర్కొన్నారన్న ఆయన...పరిమితులను విధించే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందన్నారు. ఎలాంటి పన్ను విధించకుండా మద్యాన్ని రాష్ట్రం లోపలికి అనుమతిస్తే ఖజానాను నష్టం వాటిల్లుతుందని వాదించారు. హైకోర్టులో దాఖలైన రెండు వ్యాజ్యాలను కొట్టేయాలని ప్రభుత్వ తరపు న్యాయవాది కోరారు.

ఎలాంటి అనుమతి , లైసెన్స్ లేకుండా ఎంత పరిమాణం ఉన్నా మూడు బాటిళ్లు ఓ వ్యక్తి ఎప్పుడైనా కలిగి ఉండటానికి ఒకసారి ప్రభుత్వం అనుమతిచ్చాక ..రాష్ట్రం వెలుపల కొనుగోలు చేసిన మద్యానికి అనుమతి అవసరం అని ప్రభుత్వం చెప్పడానికి వీల్లేదని హైకోర్టు ధర్మాసనం తెలిపింది. ప్రభుత్వం జీవో 411 జారీ చేసేటప్పుడు అనుమతి లేకుండా ఓ వ్యక్తి మూడు బాటిళ్లు కలిగి ఉండొచ్చని స్పష్టం చేశారన్నారు. ఎక్సైజ్ చట్టంలోని సెక్షన్ 14 లో కల్పించిన అధికారాన్ని ఉపయోగించి ఆ జీవోను జారీచేశారన్నారు . ఏపీలో తయారైన మద్యానికి , వెలుపల తయారైన మద్యానికి మధ్య వ్యత్యాసాన్ని ఆ సెక్షన్లో ప్రస్తావించలేదన్నారు. జీవో ప్రకారం ఏపీ లోపల , వెలుపల మద్యానికి వ్యత్యాసం ఉందని ప్రభుత్వ చెప్పడంలో వాస్తవం లేదన్నారు. జీవో 411 ప్రకారం రాష్ట్రం లోపల కొనుగోలు చేసినా , వెలుపల కొనుగోలు చేసినా ఎలాంటి అనుమతి లేకుండా ఒక వ్యక్తి ఐఎంఎస్ఎల్ మద్యం బాటిళ్లు కలిగి ఉండటం , వాటిని ఏపీలోకి తీసుకురావడం నేరం కాదు అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు . రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన జీవో ప్రకారం 3 స్వదేశీ తయారీ విదేశీ మద్యం బాటిళ్లు , 3 విదేశీ మద్యం బాటిళ్లు , 650 ఎం.ఎల్ 6 బీరు బాటిళ్లు , 2 లీటర్ల కల్లు అనుమతి లేకుండా ఓ వ్యక్తి కలిగి ఉండేందుకు అవకాశం ఉందని గుర్తు చేశారు.

ఇదీ చదవండి:

సీపీఎస్‌ను రద్దు చేయాలి: సీపీఐ రామకృష్ణ

Last Updated : Sep 3, 2020, 6:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.