తెలంగాణలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పును అనుసరించి పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కరోనా తీవ్రత దృష్ట్యా జీహెచ్ఎంసీలో పరీక్షలు వద్దని ఉన్నత న్యాయస్థానం సూచించింది. అయితే ఇతర రాష్ట్రాల్లో పరీక్షలు నిర్వహించకోవచ్చని తెలిపింది.
ఈ తీర్పుపై సుదీర్ఘంగా సమీక్షించిన ఆ రాష్ట్ర విద్యాశాఖ.. వేర్వేరుగా పరీక్షలు నిర్వహిస్తే సాంకేతిక సమస్యలు తలెత్తుతాయని అభిప్రాయపడింది. ఇంటర్, పాలిటెక్నిక్, ఐటీఐ ప్రవేశాల్లో గందరగోళం తలెత్తుతుందని ఉన్నతాధికారులు భావించారు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి నిర్వహించాలని లేదా పూర్తిగా రద్దు చేయాలని సూచించారు. పరీక్షలు లేకుండానే గ్రేడింగ్ ఇవ్వాలని అన్నారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్తో జరిగే భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నారు.
ఇదీ చూడండి..