TENTH RESULTS: జూన్ 10లోపు పదో తరగతి పరీక్షా ఫలితాలు విడుదల చేయనున్నారు. ఈ నెల చివరి నాటికి మూల్యాంకనం పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత ఐదారు రోజుల్లో ఇతర కార్యకలాపాలు ముగించి.. ఫలితాలు విడుదల చేయాలని ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్ణయించింది. పదో తరగతి మార్కుల ఆధారంగానే ఈ ఏడాది ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలు నిర్వహించనున్నారు. గత రెండేళ్లుగా కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించనందున.. ప్రవేశ పరీక్ష ద్వారా ప్రవేశాలు నిర్వహించారు. ఈ ఏడాది పరీక్షలు జరిపినందున.. వీటిల్లో వచ్చే మార్కుల ఆధారంగానే ప్రవేశాలు నిర్వహించనున్నారు. గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు.. కొంత వెయిటేజీ ఉంటుంది. ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ప్రాంగణాల్లో 4 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి కాకుండా 10శాతం ఈడబ్ల్యూఎస్ (EWS) కోటా సూపర్ న్యూమరీ సీట్లు ఉంటాయి.
ఇవీ చదవండి: