ETV Bharat / city

Tenth Exam fee dates: 'పది' పరీక్షల ఫీజు తేదీలు ఖరారు..

Tenth Exam fee dates : తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 29 వరకు విద్యార్థులు పాఠశాలలో ఫీజు చెల్లించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం పేర్కొంది. ఆలస్య రుసుములతో మార్చి 3 వరకు చెల్లించే అవకాశం కల్పించింది.

Tenth Exam fee dates
Tenth Exam fee dates
author img

By

Published : Jan 8, 2022, 12:29 PM IST

Tenth Exam fee dates : పదో తరగతి వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు తేదీలను తెలంగాణ ప్రభుత్వ పరీక్షల విభాగం ప్రకటించింది. ఈ నెల 29 వరకు విద్యార్థులు పాఠశాలల్లో ఫీజు చెల్లించాలని డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి తెలిపారు. విద్యార్థులు చెల్లించిన ఫీజును ఈ నెల 31 వరకు ప్రధానోపాధ్యాయులు ట్రెజరీకి బదిలీ చేయాలని పేర్కొన్నారు.

ఆలస్య రుసుములతో మార్చి 3 వరకు ఫీజు చెల్లించే అవకాశం కల్పించారు. ఆలస్య రుసుము రూ.50తో ఫిబ్రవరి 10 వరకు, రూ.200తో ఫిబ్రవరి 21 వరకు, రూ.500తో మార్చి 3 వరకు చెల్లించవచ్చునని డైరెక్టర్ తెలిపారు. పరీక్షలు ఏప్రిల్, మే నెలల్లో జరగనున్నాయి.

ఇదీ చదవండి: Palvancha Family suicide: సంచలనం రేకెత్తిస్తున్న.. రామకృష్ణ రెండో సెల్ఫీ వీడియో!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.