తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో జాతీయ పెట్టుబడులు, మౌలిక వనరుల ప్రాజెక్టు-నిమ్జ్ భూసేకరణకు ప్రజాభిప్రాయ సదస్సులో ఉద్రిక్తత నెలకొంది. న్యాల్‌కల్, ఝరాసంగం మండలాల్లోని 18 గ్రామాలకు చెందిన రైతుల అభిప్రాయాలను అధికారులు సేకరిస్తున్నారు.
ప్రజాప్రాయ సేకరణ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఐదు చోట్ల చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి... తనిఖీలు చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాకుండా పోలీసులు తమను అడ్డుకుంటున్నారంటూ... భూనిర్వాసితులు ఆందోళనకు దిగారు. కార్యక్రమం ప్రారంభం కాగానే... సమావేశ ప్రాంగణం వద్ద బైఠాయించారు. కలెక్టర్ మాట్లాడుతుండగా రైతులు అడ్డుకున్నారు.
జహీరాబాద్‌లోని 18 గ్రామాలకు చెందిన 12,635 ఎకరాల్లో నిమ్జ్ ప్రాజెక్టుకు ప్రభుత్వం రూపకల్పన చేసింది. మొదటి విడత కింద 3,500 ఎకరాలను అధికారులు సేకరించారు. రెండో విడత భూసేకరణ ప్రక్రియకు రైతుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ క్రమంలోనే జిల్లా అధికార యంత్రాంగం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది.
ఇదీ చదవండి: '1048 మంది ఆంధ్ర ఆసుపత్రి సిబ్బందికి వ్యాక్సినేషన్'