ETV Bharat / city

మనీలా విమానాశ్రయంలో చిక్కుకున్న తెలుగు విద్యార్థులు - latest news on carona

ఫిలిప్పీన్స్​లోని మనీలా విమానాశ్రయంలో సుమారు 90 మంది తెలుగు విద్యార్థులు చిక్కుకున్నారు. కరోనా దృష్ట్యా పలు దేశాల నుంచి మన దేశానికి వచ్చే విమానాలను నిలిపివేశారు. తాము మనీలాలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, అధికారులు స్పందించాలని విద్యార్థులు కోరారు.

telugu students strucked at manila airport
మనీలా విమానాశ్రయంలో ఇరుక్కున్న 90 మంది తెలుగు విద్యార్థులు
author img

By

Published : Mar 18, 2020, 5:21 PM IST

మనీలా విమానాశ్రయంలో ఇరుక్కున్న 90 మంది తెలుగు విద్యార్థులు

ఫిలిప్పీన్స్​లోని​ మనీలా విమానాశ్రయంలో సుమారు 90 మంది తెలుగు విద్యార్థులు రెండు రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఫిలిప్పీన్స్‌లోని పలు విశ్వవిద్యాలయాలు, కళాశాలలు విద్యార్థులకు అక్కడి ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అక్కడ చదువుతున్న విదేశీ విద్యార్థులు 72 గంటల్లోగా స్వదేశాలకు వెళ్లిపోవాలని సూచించింది. దీంతో వందలాది మంది తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు రావడానికి విమానాశ్రయానికి చేరుకున్నారు. కానీ అక్కడ అధికారులు వారిని అడ్డుకుంటున్నారు. కరోనా దృష్ట్యా పలు దేశాల నుంచి మన దేశానికి వచ్చే విమానాలను నిలిపివేశారు. అధికారులు స్పందించక ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, అధికారులు స్పందించాలని విద్యార్థులు విజ్ఞప్తి చేశారు. కరోనా వ్యాప్తితో ఆ దేశ ప్రభుత్వం తమకు సెలవులు ప్రకటించారని విద్యార్థులు తెలిపారు. తమను కళాశాల యాజమాన్యం గురువారం సాయంత్రంలోపు ఖాళీచేయాలని.. లేనిపక్షంలో నిర్బంధిస్తామని హెచ్చరికలు జారీచేసిందన్నారు. అంతేకాక.. అనుమతి లేకుండా వీధుల్లో సంచరిస్తే కాల్చివేస్తామని కూడా హెచ్చరికలు చేసిందని వాపోయారు. అధికారులు స్పందించి వెంటనే స్వదేశానికి తీసుకువచ్చే ప్రయత్నం చేయాలని కోరారు.

ఇదీ చదవండి : భారత్​కు పయనమైన తెలుగు విద్యార్థులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.