విభజన సమస్యలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అధికారుల మధ్య ఈరోజు చర్చలు జరిగాయి. హైదరాబాద్ బీఆర్కే భవన్‌లో ఇరురాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్, విభజన వ్యవహారాల కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. ఏపీ విభజన వ్యవహారాల కార్యదర్శి ప్రేమ్ చంద్రారెడ్డి, ఇతర అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
9, 10 షెడ్యూళ్లలోని సంస్థల విభజన, విద్యుత్ ఉద్యోగుల విభజనపై చర్చ నడిచింది. పౌరసరఫరాల సంస్థ అంశాలు, ఇతర విషయాలపై సమావేశంలో చర్చకు వచ్చింది. తమ అభిప్రాయాలు ఇరురాష్ట్రాల అధికారులు వెలిబుచ్చారు. తదుపరి సీఎస్‌ల స్థాయిలో చర్చలు జరగనున్నాయి.
ఇదీ చదవండి :