రాష్ట్రంలోని ఆస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వం రూ.436.96 కోట్లు విడుదల చేసింది. నవరత్నాల అమల్లో భాగంగా ఆస్పత్రుల్లో వసతుల కల్పనకు ఈ నిధులు వినియోగించనుంది. సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాంతీయ ఆస్పత్రుల బలోపేతానికి నిధుల విడుదల చేసింది. కమ్యూనిటీ హెల్త్ సెంటర్ల అభివృద్ధికి తక్షణం చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని 3 ఏరియా ఆస్పత్రుల అభివృద్ధికి రూ.24.45 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం.. రాష్ట్రంలోని 89 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లకు రూ.399.73 కోట్లు జారీ చేసింది. ఒంగోలులోని మాతాశిశు ప్రభుత్వాస్పత్రికి రూ.1.76 కోట్లు, అనంతపురం సీడీహెచ్ ఆస్పత్రి అభివృద్ధికి రూ.11.07 కోట్లు కేటాయించింది.
ఇదీ చదవండి :