ఉత్తరాంధ్ర అభివృద్ధి, అమరావతి గురించి మాట్లాడే అర్హత మంత్రి బొత్స సత్యనారాయణకు లేదని తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షులు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజమెత్తారు. సారా సరఫరాలో కమీషన్లు, విశాఖలో భూములమ్మితే తనకెంతొస్తుంది అనే అంశాలపైనే మంత్రి దృష్టి ఉందని ఆరోపించారు. అమరావతి రైతులతో మాట్లాడే దమ్ము, ధైర్యం ముఖ్యమంత్రికే లేవని.. అందుకే ఆయన చాటుమాటుగా వారి కంటపడకుండా వెళ్లిపోతున్నారని ఎద్దేవా చేశారు.
విశాఖను రాజధాని చేసే అంశంపై అమరావతి రైతులతో మాట్లాడేది లేదంటున్న మంత్రి బొత్స.. కనీసం మూడు రాజధానుల శిబిరంలోని కిరాయి వ్యక్తులతో మాట్లాడాలని డిమాండ్ చేశారు. అలాగే.. ఆ మూడు రాజధానులను ఎప్పటిలోగా నిర్మిస్తారన్న విషయాన్ని ఆ శిబిరంలోని వారికి చెప్పాలన్నారు. కనీసం వారితో అయినా దీక్షలు విరమింపచేయించాలని మర్రెడ్డి ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: