ETV Bharat / city

Telangana Sakinalu: సంక్రాంతి వేళ సకినాల సందడి.. మహిళలు బిజీబిజీ - Making sakinalu

Telangana Sakinalu: సంక్రాంతి పండగ వచ్చిందంటే చాలు.. నోరూరించే సకినాలు, గారెలు, అరిసెలు ఇలా వివిధ రకాల పిండివంటలు ప్రతి ఇంటా ఘుమఘుమలాడతాయి. మరీ ముఖ్యంగా మహిళలు అంతా ఒకచోట చేరి.. సకినాలు చేస్తూ రోజంతా ఉత్సాహంగా గడుపుతారు. ఇప్పుడు ఏ ఇంట్లో చూసినా.. మహిళలు బిజీబిజీగా పిండి వంటల తయారీలో నిమగ్నమయ్యారు.

Sakinalu
Sakinalu
author img

By

Published : Jan 14, 2022, 8:42 AM IST

Telangana Sakinalu: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సంక్రాంతి పండగ సందడి నెలకొంది. ప్రతి ఇంటా పిండి వంటల ఘుమఘుమలు నోరూరిస్తున్నాయి. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నోరూరించే పిండి వంటలు చేస్తున్నారు. తెలంగాణలో సంక్రాంతికి ప్రత్యేకంగా తయారు చేసే.. సకినాల కోసం మహిళలు అంతా ఒక వద్ద చేరడం పరిపాటి. రోజంతా ఒకే దగ్గర ఉండి స్నేహభావం పంచుకుంటూ... సకినాలు తయారు చేస్తున్నారు.

నోరూరించే సకినాలు ఆరోగ్యానికి మంచిదని మహిళలు చెబుతున్నారు. ఇలా ప్రతి ఏటా సంక్రాంతి పండుగకు... ముందు నుంచే ఇంటింటా సకినాల తయారీలో నిమగ్నమై... సందడి చేస్తుంటారు.

మరాఠీలకు సకినాల రుచి...

మహారాష్ట్ర సరిహద్దులోని ధర్మాబాద్ పట్టణంలో తెలంగాణ ఆడపడుచులు పిండి వంటకాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. అందులో ముఖ్యంగా సంక్రాంతికి ప్రత్యేకమైన సకినాల రుచులను... మరాఠీలకు రుచి చూపిస్తున్నారు. అంతేకాదు తమకు ఉన్న నైపుణ్యాన్నే ఉపాధి మార్గంగా ఎంచుకొని ఇక్కడి రుచులను ఎల్లలు దాటిస్తున్నారు. దేశ విదేశాల్లోనూ... వీటిని విక్రయిస్తున్నారు.

గొప్ప అనుభూతి...

గతంలో వీరంతా మహారాష్ట్ర సరిహద్దులోని బాలాపూర్‌లో బీడీలు చుట్టి అరకొర ఉపాధి పొందేవారు. వీరంతా స్వయం సహాయక సంఘంగా ఏర్పడి ధర్మాబాద్‌లో ఓ గదిని అద్దెకు తీసుకుని... పిండి వంటల తయారీలో రాణిస్తున్నారు. ప్రస్తుతం సంక్రాంతికి ప్రత్యేకమైన సకినాల తయారీలో నిమగ్నమయ్యారు. సకినాలు తింటూ సంక్రాంతి జరుపుకోవటం... గొప్ప అనుభూతిగా రాష్ట్ర ప్రజలు భావిస్తుంటారు.

ఇదీ చదవండి:

Pongal: తెలుగు లోగిళ్లలో వైభవంగా భోగి సందడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.