ETV Bharat / city

ఈనెల 25న తెలంగాణ ఇంటర్​ ఫలితాలు విడుదల..?

author img

By

Published : Jun 22, 2022, 12:34 PM IST

TS Intermediate Results 2022 : ఈనెల 25న ఇంటర్​ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను విడుదల చేసేందుకు తెలంగాణ ఇంటర్​ బోర్డు సిద్ధమవుతోంది. జవాబు పత్రాల మూల్యాంకన సహా అన్ని ప్రక్రియలు పూర్తయిన సందర్భంగా తప్పులు రాకుండా సాఫ్ట్​వేర్​ ద్వారా పరిశీలిస్తున్నట్లు బోర్డు కార్యదర్శి జలీల్​ తెలిపారు.

25న తెలంగాణ ఇంటర్​ ఫలితాలు..?
25న తెలంగాణ ఇంటర్​ ఫలితాలు..?

TS Intermediate Results 2022 : ఇంటర్​ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను ఈనెల 25న విడుదల చేసేందుకు తెలంగాణ ఇంటర్​బోర్డు కసరత్తు చేస్తోంది. పరీక్షలన్నీ మే 24తో పూర్తికాగా అదే నెల 8 నుంచి జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ప్రారంభించారు. ఫలితాలను జూన్​ 20లోపు వెల్లడిస్తామని నెల రోజుల క్రితమే ఇంటర్​ బోర్డు కార్యదర్శి జలీల్​ వెల్లడించారు.

తాజాగా ప్రక్రియ మొత్తం పూర్తైనందున తప్పులు రాకుండా సాఫ్ట్​వేర్​ ద్వారా పరిశీలిస్తామన్నారు జలీల్​. ఈ క్రమంలో జూన్​ 25న ఫలితాలు విడుదల చేసేందుకు బోర్డు సిద్ధమైనట్లు సమాచారం. సుమారు 9 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం ఫలితాలు వెలువడిన 15 రోజుల్లోనే అడ్వాన్స్​డ్​ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని జలీల్​ గతంలోనే ప్రకటించారు.

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.