ETV Bharat / city

ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకున్న టీఎస్ ప్రభుత్వం

ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని తెలంగాణ కేడర్​లోకి తీసుకుంటూ టీఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబర్ 583 జారీ చేసి ఆయన్ను విధుల్లోకి తీసుకున్నట్లు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకున్న టీఎస్ ప్రభుత్వం
ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకున్న టీఎస్ ప్రభుత్వం
author img

By

Published : Mar 15, 2022, 9:04 PM IST

ఐపీఎస్ అధికారి అభిషేక్ మొహంతిని తెలంగాణ కేడర్​లోకి తీసుకుంటూ టీఎస్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిన్న జీవో 583 జారీ చేసినట్లు హైకోర్టుకు రాష్ట్ర సర్కారు నివేదించింది. అఖిల భారత సర్వీసు అధికారుల విభజనలో భాగంగా అభిషేక్ మొహంతిని కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్​కు కేటాయించింది. ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్​ను ఆశ్రయించిన అభిషేక్... తనను తెలంగాణకు కేటాయించాలని కోరారు.

వాదనలు విన్న క్యాట్... అభిషేక్ మహంతిని తెలంగాణకు కేటాయించాలని ఉత్తర్వులు జారీ చేసింది. అభిషేక్ మొహంతిని విధుల నుంచి రిలీవ్ చేయాలని అటు ఏపీని.. విధుల్లో చేర్చుకోవాలని ఇటు తెలంగాణను ఆదేశించింది. ట్రైబ్యునల్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం రిలీవ్ చేసినప్పటికీ.. విధుల్లోకి చేర్చుకుంటున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయలేదు. దీంతో తెలంగాణ సీఎస్​పై అభిషేక్ మహంతి ట్రైబ్యునల్​లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. సీఎస్ తీరుపై ఇటీవల ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు.. ఇవాళ(మార్చి 15) వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది.

క్యాట్ విచారణ నిలిపివేయాలని తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు... అభిషేక్ మహంతిని ఎందుకు విధుల్లోకి తీసుకోవడం లేదని ప్రశ్నిస్తూ క్యాట్ ఆదేశాలు ఎందుకు అమలు చేయడం లేదో చెప్పాలని స్పష్టం చేసింది. దీనిపై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది. అభిషేక్ మొహంతిని విధుల్లోకి తీసుకుంటూ జీవో జారీ చేసినట్లు అడ్వకేట్ జనరల్ తెలిపారు. దీంతో సీఎస్​ వ్యక్తిగతంగా హాజరు కావాలన్న క్యాట్ ఉత్తర్వులను హైకోర్టు నిలిపివేసింది.

ఇదీ చూడండి:

Anganwadi's Protest: విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తల ఆందోళన.. ఉద్రిక్తత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.