ETV Bharat / city

TS SCHOOLS REOPEN: రేపటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు - telangana education news update today

రేపటి నుంచి తెలంగాణలో విద్యా సంస్థలు ప్రారంభం కానున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు గురుకులాల్లో ప్రత్యక్ష బోధనను నిలిపివేస్తూ విద్యా శాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు.

రేపటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు
రేపటి నుంచి తెరుచుకోనున్న పాఠశాలలు
author img

By

Published : Aug 31, 2021, 10:26 PM IST

తెలంగాణలో విద్యా సంస్థలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. కేజీ నుంచి పీజీ వరకు ప్రత్యక్ష తరగతులు ప్రారంభించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు గురుకులాల్లో ప్రత్యక్ష బోధనను నిలిపివేస్తూ విద్యా శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. పాఠాలు ఆన్​లైన్​ లో బోధిస్తారా లేక ప్రత్యక్ష తరగతులు నిర్వహిస్తారా లేక రెండు పద్ధతులను అనుసరిస్తారా అనే నిర్ణయం పాఠశాలల యాజమాన్యాల స్వేచ్ఛకే వదిలిపెడుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ విషయంలో స్పష్టత కరవు..

అయితే సర్కారు బడుల్లో ప్రత్యక్ష తరగతులకు వెళ్లేందుకు ఇష్టం లేని విద్యార్థులకు టీవీ పాఠాలు కొనసాగుతాయా లేదా అనే విషయంపై విద్యాశాఖ స్పష్టతనివ్వలేదు. కొవిడ్ సోకితే తమ బాధ్యత కాదంటూ తల్లిదండ్రుల నుంచి కొన్ని విద్యా సంస్థలు తీసుకుంటున్న అంగీకార పత్రానికి ఎలాంటి చట్టబద్ధత ఉండదని విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించే విద్యా సంస్థలు అనుసరించాల్సిన విధివిధానాలు, మార్గదర్శకాలు రూపొందించి విస్తృతంగా ప్రచారం చేయాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్​ను ప్రభుత్వం ఆదేశించింది.

కళాశాలల్లో ప్రత్యక్ష తరగతులే..

ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్ కాలేజీల్లో రేపటి నుంచి ప్రత్యక్ష బోధన మాత్రమే జరగనుంది. హైకోర్టు ఆదేశాలు పాఠశాలలకు మాత్రమే వర్తిస్తాయి కాబట్టి.. కళాశాలల్లో ప్రత్యక్ష తరగతుల ప్రారంభంపై గతంలో తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పులు చేయలేదు.

హైకోర్టు ఏం చెప్పిందంటే..

ప్రత్యక్ష బోధనకు తప్పనిసరిగా హాజరు కావాలని విద్యార్థులను బలవంత పెట్టవద్దంటూ తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యక్ష తరగతులకు హాజరు కాని విద్యార్థులపై ఎలాంటి చర్యలు తీసుకోరాదని స్పష్టం చేసింది. అదేవిధంగా ఆన్​లైన్ ​బోధన కొనసాగించాలా.. ఆఫ్​లైన్​ తరగతులే ప్రారంభించాలా అనే నిర్ణయం విద్యా సంస్థలే తీసుకోవాలని పేర్కొంది. ప్రత్యక్ష తరగతులు నిర్వహించని విద్యా సంస్థలపైనా చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది.

ప్రత్యక్ష బోధన నిర్వహించే విద్యా సంస్థలు అనుసరించాల్సిన విధివిధానాలను వారంలోగా ఖరారు చేసి.. మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేయడం సహా అధికారులు తనిఖీలు చేయాలని సూచించింది. గురుకుల విద్యాలయాలను ఇప్పుడే తెరవొద్దని స్పష్టం చేసింది. ప్రభుత్వ గురుకుల విద్యాసంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభించాలన్న ఉత్తర్వులను నిలిపివేస్తూ స్టే ఉత్తర్వులు జారీ చేసింది. గురుకులాల్లో వసతులపై పూర్తి వివరాలతో నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. కొవిడ్​పై ప్రభుత్వం ఏర్పాటు చేసిన సలహా కమిటీ ఇచ్చిన నివేదికను తమకు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రత్యక్ష తరగతులు, ఆన్​లైన్​ బోధనపై భిన్నాభిప్రాయాలు. లాభ నష్టాలు ఉన్నాయని హైకోర్టు అభిప్రాయపడింది. చాలాకాలంగా విద్యా సంస్థలకు దూరంగా ఉండటం వల్ల పిల్లల్లో మానసిక సమస్యలు తలెత్తుతున్నాయన్న అధ్యయనాలు ఉన్నాయని చెప్పింది. ఇంటర్నెట్ కనెక్టివిటీ వంటి సమస్యల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆన్​లైన్​ తరగతులు అందుకుకోలేకపోతున్నారని ధర్మాసనం పేర్కొంది. మరోవైపు ప్రస్తుతం కొవిడ్ తీవ్రత కొనసాగుతోందని.. త్వరలో మూడో దశ ముప్పు పొంచి ఉందన్న హెచ్చరికలు కూడా వస్తున్నాయని న్యాయస్థానం పేర్కొంది.

ఇవీ చూడండి:

Buggana:'పెండింగ్ నిధులపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్​తో చర్చించా'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.