ETV Bharat / city

KCR Tour: కేజ్రీవాల్​తో సీఎం కేసీఆర్​ భేటీ... జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తిపై చర్చ - దిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​ను కలిసిన కేసీఆర్

KCR Meets Arvind Kejriwal : ఉత్తర భారత పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్... దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. ఇరువురు సీఎంలు పలు అంశాలపై చర్చలు జరిపారు. కేజ్రీవాల్‌ నివాసంలోనే సీఎం మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం ఇరువురు సీఎంలు వారి బృందాలతో చండీగఢ్​కు బయల్దేరారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతూ అమరులైన రైతు కుటుంబాలకు అక్కడ సీఎం కేసీఆర్ రూ.3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తారు. చండీగఢ్​లోని ఠాగూర్ థియేటర్​లో జరగనున్న ఈ కార్యక్రమంలో పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్‌​ మాన్ కూడా పాల్గొంటారు.

KCR Meets Arvind Kejriwal
కాసేపట్లో సీఎం కేజ్రివాల్ నివాసానికి.. తెలంగాణ సీఎం
author img

By

Published : May 22, 2022, 12:32 PM IST

Updated : May 22, 2022, 4:54 PM IST

KCR Meets Arvind Kejriwal : ఉత్తరాది రాష్ట్రాల్లో సీఎం కేసీఆర్‌ పర్యటన కొనసాగుతోంది. దిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్... పలు అంశాలపై చర్చలు జరిపారు. కేజ్రీవాల్ నివాసానికి వెళ్లిన కేసీఆర్.. కాసేపు ముచ్చటించి అక్కడే భోజనం చేశారు. అనంతరం జాతీయ రాజకీయాలు, సమాఖ్య స్ఫూర్తిపై ఇరువురు నేతల ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది. దేశ ప్రగతిలో రాష్ట్రాల పాత్ర, కేంద్రం విధానాలపై ఇరువురు సీఎంలు చర్చించారు. తర్వాత దిల్లీ నుంచి చండీగఢ్‌ కేసీఆర్, కేజ్రీవాల్‌ బయల్దేరారు. సాగుచట్టాలపై పోరులో అమరులైన రైతు కుటుంబాలను సీఎంలు పరామర్శించనున్నారు. చండీగఢ్‌లో రైతులు, సైనికుల కుటుంబాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెక్కులు ఇవ్వనున్నారు. 600 వందల కుటుంబాలకు ఆర్థిక సహకారం అందించనున్నారు. ఈ కార్యక్రమంలో దిల్లీ సీఎం కేజ్రీవాల్​తో పాటుగా పంజాబ్ సీఎం భగవంత్‌సింగ్‌ మాన్ పాల్గొననున్నారు. చండీగఢ్​లోని ఠాగూర్ థియేటర్​లో జరగనున్న ఈ కార్యక్రమంలో బాధిత రైతు కుటుంబాలతో పాటు స్థానిక నేతలు హాజరుకానున్నారు.

KCR Delhi Tour Updates : నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా 378 రోజుల పాటు రైతులు చేసిన ఉద్యమంలో 700 మంది కర్షకులు చనిపోయారు. ఇందులో 600 మంది రైతులు పంజాబ్​కు చెందిన వారే ఉన్నారు. వారికి ఇవాళ కేసీఆర్ ఆర్థిక సాయం అందించనున్నారు. సాగు చట్టాలను కేంద్రం వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన రోజు.. తు ఉద్యమంలో పోరాడి మృతిచెందిన కర్షక కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేస్తానని కేసీఆర్ ప్రకటించారు. ఈ మేరకు ఇవాళ వారికి చెక్కులు అందజేయనున్నారు. ఇప్పటికే పంబాజ్ ప్రభుత్వం.. రైతు ఉద్యమంలో చనిపోయిన వారి కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు రూ.5 లక్షల పరిహారం అందించింది.

పంజాబ్​కు చెందిన ప్రతి జిల్లా వ్యవసాయ అధికారి.. ఉద్యమంలో మరణించిన వారి జిల్లాకు చెందిన రైతు కుటుంబాలను ఠాగూర్ థియేటర్​కు తీసుకువస్తారు. వేరే రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రి తమ రాష్ట్రానికి చెందిన రైతులకు భారీ పరిహారం చెల్లించడం ఇదే మొదటిసారి అని అధికారులు అంటున్నారు.

ఇవీ చదవండి ..

Last Updated : May 22, 2022, 4:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.