ETV Bharat / city

తెలంగాణ: కొత్త సచివాలయ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోదం - cabinet

తెలంగాణ కొత్త సచివాలయ నిర్మాణానికి ఆమోదం, కరోనా కట్టడి, నియంత్రిత సాగుపై చర్చతో పాటు పలు కొత్త విధానాలకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా పాఠశాల విద్యార్థులకు ఆన్​లైన్ తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. ప్రవేశ పరీక్షల షెడ్యూల్​ను ఖరారు చేయాలని... డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం పరీక్షల విషయంలో న్యాయస్థాన ఆదేశాల మేరకు నడుచుకోవాలని అధికారులకు స్పష్టం చేసింది.

telangana cabinet meeting
కొత్త సచివాలయ నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం
author img

By

Published : Aug 6, 2020, 6:22 AM IST

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సుదీర్ఘంగా సాగింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్​లో మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభమైన కేబినెట్ భేటీ... తొమ్మిది గంటల పాటు రాత్రి 11 గంటల వరకు జరిగింది. కొత్త సచివాలయ నిర్మాణం, రాష్ట్రంలో కరోనా కట్టడి, నియంత్రిత సాగు తదితర అంశాలపై చర్చించింది. కొత్త సచివాలయ భవన నిర్మాణానికి ఆమోదముద్ర వేసింది. వివిధ అంశాలకు సంబంధించి పలు విధానాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కొత్త విధానానికి ఆమోదం తెలిపింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. హైదరాబాద్ నగరంలో ఐటీ పరిశ్రమలు ఒకే చోట కాకుండా నగరం నలువైపులా విస్తరించేలా హైదరాబాద్ గ్రిడ్ పాలసీని ఆమోదించింది. పెరిగి పోతున్న వాహనాల వల్ల ఎక్కువయ్యే వాయు కాలుష్యాన్ని తగ్గించేలా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు తెలంగాణ స్టేట్ ఎలక్ట్రానిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ విధానానికి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రత్యేక రాయితీలు ఇచ్చి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ పరిశ్రమను ప్రోత్సహించాలని నిర్ణయించింది.

టీఎస్​ బీపాస్​ విధానానికి ఆమోదం

భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టీఎస్ బీపాస్ విధానాన్ని మంత్రివర్గం ఆమోదించింది. టీఎస్ ఐపాస్ తరహాలోనే టీఎస్ బీపాస్ కూడా అనుమతుల విషయంలో పెద్ద సంస్కరణ అని కేబినెట్ అభిప్రాయపడింది. రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న కార్మికుల సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తయారు చేయాలని నిర్ణయించింది. పుట్టిన ఊరు, కన్న వారిని, కుటుంబాన్ని వదిలి పనికోసం తెలంగాణకు వచ్చే కార్మికులకు ఇదే తమ ఇల్లు అనే భావన, భరోసా కలిగించేలా విధానాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించింది.

పాఠశాల విద్యార్థులకు ఆన్​లైన్​ తరగతులు

కొవిడ్ నేపథ్యంలో విద్యారంగానికి సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై మంత్రివర్గం చర్చించింది. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు ఆన్​లైన్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ ను వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఆన్​లైన్ తరగతులకు సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించాలని... డిగ్రీ, పీజీ చివరి సంవత్సరం పరీక్షల నిర్వహణలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది. దుమ్ముగూడెం అనకట్టకు సీతమ్మ సాగర్, తుపాకులగూడం ఆనకట్టకు సమ్మక్క ఆనకట్టగా పేర్లు పెడుతూ తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.బస్వాపూర్ జలాశయానికి నృసింహస్వామి జలాశయంగా నామకరణం చేస్తూ కేబినెట్ తీర్మానించింది.

ప్రభుత్వ కార్యాలయాలు విద్యుత్​ బిల్లులు చెల్లించాల్సిందే..

కొల్లాపూర్ నియోజకవర్గంలో సింగోటం, గోపల్ దిన్నె జలాశయాల అనుసంధానానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వీపనగండ్ల, చిన్నంబావి మండలాలకు సాగునీరు అందేలా 147 కోట్ల రూపాయలతో లింక్ కాల్వ పనులు చేపట్టనున్నారు. మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన విద్యుత్ బిల్లులను ప్రతి నెలా క్రమం తప్పకుండా చెల్లించాల్సిందేనన్న కేబినెట్... ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు గతంలో ఉన్న విద్యుత్ బకాయిలను వన్ టైమ్ సెటిల్​మెంట్ ద్వారా చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని నిర్ణయించింది.

నిరాడంబరంగా స్వాతంత్య్ర వేడుకలు

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన పనికి రాని పాత వాహనాలను అమ్మేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కొవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈ సారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. జూన్ రెండున రాష్ట్రావతరణ దినోత్సవం నిర్వహించినట్లుగానే స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించాలని తీర్మానించింది.

ఇవీ చూడండి:

సీఎం మాట తప్పి మడమ తిప్పారు.. రాజీనామా చేస్తారా..?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.